Singer Kousalya : కరోనాతో మంచానపడ్డ స్టార్ సింగర్.. పైకిలేచే ఓపిక లేదంటున్న కౌసల్య.

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో వరుసగా కరోనా కాటుకు గురౌతున్నారు స్టార్స్. ఇక ఇప్పుడు సింగర్ కౌసల్య (Kousalya) కూడా కరోనా బారిన పడ్డారు.

Singer Kousalya tested covid Positive

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో వరుసగా కరోనా కాటుకు గురౌతున్నారు స్టార్స్. ఇక ఇప్పుడు సింగర్ కౌసల్య (Kousalya) కూడా కరోనా బారిన పడ్డారు.

ఇండస్ట్రీని గట్టిగా పట్టి పీడిస్తుంది కరోనా భూతం. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా కరోనాతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు ఆమధ్య మహేష్ బాబు, కమల్ హాసన్ లాంటిస్టార్స్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుని ఈ మధ్యే కోలుకున్నారు. మరికొంత మంది స్టార్స్ ఇప్టపికీ కరోనా తో క్యారంటేన్ డేస్ ను గడిపేస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ కౌసల్య(Kousalya)  కూడా కరోనాబారిన పడ్డారు.

సింగ‌ర్‌ కౌసల్య‌(Kousalya) కు క‌రోనా పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. త‌న ఆరోగ్యానికి సంబంధించిన‌ వివ‌రాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది కౌసల్య(Kousalya). తనకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిందని, ల‌క్ష‌ణాలు కూడా తీవ్రంగానే ఉన్నాయని ఆమె వివ‌రించింది. త‌న‌కు రెండు రోజుల నుంచే జ్వ‌రం ఉందని, ప్ర‌స్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నానని తెలిపింది.



అంతే కాదు కరోనాకి తోడు ఇప్పుడు త‌న‌ను గొంతు నొప్పి కూడా చాలా ఇబ్బంది పెడుతోందని కౌస‌ల్య(Kousalya) చెప్పింది. క‌రోనాకు మందులు వాడుతున్నప్పటికీ  ఈ బాధను తట్టుకోలేకపోతున్నట్టు చెపుతోంది కౌసల్య.  క‌రోనా విజృంభిస్తుండ‌డంతో ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె పేర్కొంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని. అందరూ వాక్సిన్ వేయించుకోవాలంటోంది స్టార్ సింగర్.

 సింగ‌ర్ కౌస‌ల్య(Kousalya)  తెలుగులో చాలా చాలా సూపర్ హిట్  పాట‌లు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా చక్రి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువ పాటలు పాడారు. చక్రి మరణం తరువాత కౌసల్యకు అవకాశాలు తగ్గాయి. ఇప్పటికీ స్టేజ్ షోస్ చేసుకుంటూ.. అడపాదడపా సినిమాల్లో పాటలు పాడుతున్నారు కౌసల్య(Kousalya). ఆమెకు కరోనా అని తెలిసన అభిమానులు త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios