సింగర్ కౌసల్య తాను ఎదుర్కొన్న పర్సనల్ సమస్యలను బయటపెట్టింది. తన భర్త కారణంగా ఎంతటి ఇబ్బందులు ఫేస్ చేసిందో చెప్పింది. అంతేకాదు సెకండ్ మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చింది.
ప్లే బ్యాక్ సింగర్‌గా పాపులర్ అయ్యింది కౌసల్య. ఆమె వందల్లోనే పాటలు ఆలపించారు. తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా అలరించారు. తనదైన గాత్రంతో పాటకి ప్రాణం పోశారు. ఇటీవల కాలంలో ఆమె యాక్టివ్‌గా ఉండటం లేదు. వ్యక్తిగత కారణాలు, పర్సనల్ లైఫ్‌లోని స్ట్రగుల్స్ కారణంగా ఆమె పాటలు తగ్గించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె తన జీవితంలోని స్ట్రగుల్స్ ని బయటపెట్టింది. భర్తతో ఎదురైన ఇబ్బందులను ఆమె వెల్లడించింది.
ఓ ఇంటర్వ్యూలో కౌసల్య మాట్లాడుతూ, మ్యారేజ్ లైఫ్‌లో తాను చాలా బాధలు అనుభవించినట్టు చెప్పింది. తన బాధలను తనలోనే దాచుకుందట. తన బాబు చిన్న పిల్లవాడు కావడంతో అతడి కోసమే తాను అన్నింటిని దిగమింగినట్టు చెప్పింది. అయినా మరీ ఫ్రస్టేషన్ పెరిగినప్పుడు తన చెల్లి, అమ్మతో పంచుకునేదాన్ని అని వెల్లడించింది కౌసల్య. తన అమ్మ దగ్గర అన్ని విషయాలు చెప్పుకునేదట. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకుపోదామని ఓపికగా అన్ని భరించానని, కానీ ఆయన చివరికి మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారని తెలిపింది.
ప్రస్తుతం తన కుమారుడు పెద్ద వాడయ్యాడని, అతన్ని చూస్తుంటే హ్యాపీగా ఉందని చెప్పింది. అయితే ఇప్పుడు కొత్తసమస్య వచ్చిందని చెప్పింది కౌసల్య. ఇప్పుడు తనని మళ్లీ పెళ్లి చేసుకోవాలని తన కుమారుడు ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొంది. తన జీవితంలో సంతోషం చూడాలనేది వాడి కోరిక అని చెప్పింది. `నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మే పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు నా కొడుకే నా లోకం. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషించేది బాబే` అని చెప్పింది కౌసల్య.
1999లో `నీ కోసం` చిత్రంతో సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది కౌసల్య. `బంగారు కొండ`, `చిత్రం`, `ఇడియట్`, `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `నువ్వు లేక నేను లేను`, `అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు`, `శివమణి`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`, `గంగోత్రి`, `దేవదాస్`, `సత్యం`, `దేశముదురు`, `చెన్న కేశవ రెడ్డి`, `చక్రం`, `నువ్వే నువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `నరసింహుడు`, `శ్రావణమాసం`, `ఢీ`, `దుబాయ్ శ్రీను`, `నగరం`, `టక్కరి`, `కృష్ణ`, `మస్క`, `నేనింతే`, `సింహా`, `గోలిమార్`, `పూలరంగడు`, `సోగ్గాడే చిన్న నాయన` వంటి చిత్రాల్లో పాటలు పాడి అలరించింది. అంతేకాదు ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పనిచేశారు. నటి కళ్యాణికి వాయిస్ అందించారు.