బాలీవుడ్ స్టార్ సింగర్ కేకే మరణంతో బాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే ఆయన మరణం ఎలా జరిగింది, కేకే మరణానికి కారణాలుఏమైనా ఉన్నాయా.. అన్న విషయంపై పోలీస్ విచారణ కొనసాగుతోంది.
మంగళవారం (మే 31) రాత్రి ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కు షాకింగ్ న్యూస్ అందింది. కోల్ కతాలో లైవ్ షో చేసిన సింగర్ కేకే.. కొద్ది సేపటికే హఠాత్తుగా మరణించారు. కోల్‌కతాలో లైఫ్ మ్యూజిక్ షోను ముగించిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. 53 సంవత్సరాల వయస్సులో కేకే కన్నుమూశారు. అయిత కేకే మరణంపై అనేక అనుమానాలు వ్యాక్తం అవుతున్నాయి. ఆయనది సహజమరణమేనా..? అసలు ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కెకె మరణంపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆయన మరణం సహజమరణమా.. కాదా అన్న విషయంపై విచారణ చేయనున్నారు పోలీసులు. కోల్ కతా న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో... కేకేది అసహజ మరణంగా కేసు నమోదు చేయబడింది. ఈ విషయంలో వివరణ ఇస్తూ..ఓ పోలీస్ అధికారి మాట్లాడారు. మేము హోటల్ అధికారులతో మాట్లాడుతున్నాము మరియు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నాము అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
కోల్‌కతా పోలీస్ న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్ గాయకుడు KK ఆకస్మిక మరణంపై అసహజ మరణంగా కేసును నమోదు చేసింది. వారి రూల్స్ ప్రకారం , ఆడిటోరియంలో అసలు సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఉన్నారా, ఏసీలు పని చేస్తున్నాయా లేదా అనే అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రదర్శన చేస్తున్నప్పుడు KK అనారోగ్యానికి గురికావడానికి ప్రస్తుతం ఉన్న ఏవైనా పరిస్థితులు దారితీశాయా అని వారు తనిఖీ చేస్తున్నారు. కేకేది సహజమరణమా.. లేదా అనే విషయాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.
అటు బయట నుంచి కూడా ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కేకే కుటుంబ సభ్యలు కోల్ కతాకు వచ్చారు. ఈ విచారణ సమయంలో పోలీసులు వారితో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కెకె హిందీలో 500 కంటే ఎక్కువ పాటలు పాడారు కేకే. తెలుగు, బెంగాలీ, కన్నడ మరియు మలయాళ భాషలలో 200 కంటే ఎక్కువ పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎన్నో అవార్డ్స్ ను అందుకున్నారు కేకే. మరెన్నో గౌరవాలను పొందారు కూడా.
