యంగ్ సింగర్ కారుణ్య ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లిగారైన జానకి తుదిశ్వాస విడిచారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘనట జరినట్లు సమాచారం. జానకి గారి వయసు 70ఏళ్లుగా తెలుస్తుంది. బీడీఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్ అయిన జానకి కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. క్యాన్సర్ తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి విషమించి ఆమె మరణించారు. 

మీర్ పేట్ చౌరస్తాలోని త్రివేణి నగర లో వీరు నివాసం ఉంటుండగా అక్కడే ఆమె మరణించారు. ఇక సైదాబాదు స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య తల్లిగారైన జానకి మరణం తెలుసుకున్న పలువురు చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి ప్రకటించడం జరిగింది. 

ఇక సింగర్ గా కారుణ్య అనేక భాషలో పాడడం జరిగింది. ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సెకండ్ సీజన్ లో కారుణ్య పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచారు. ఆ సీజన్ కి కారుణ్య రన్నర్ గా నిలవడం విశేషం. ఆ తరువాత కారుణ్య ప్లే బ్యాక్ సింగర్ గా సెటిల్ అయ్యారు.