కరోనా పట్ల ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్న వేళ స్టార్ సింగర్ కనికా కపూర్ కోవిడ్ భారిన పడ్డారని వార్తలు రావడం జరిగింది. లండన్ నుండి ఇండియా వచ్చినా కనికా... ఆ వెంటనే కొన్ని ప్రైవేట్ పార్టీలలో పాల్గొన్నారు. దీనితో ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. విదేశాల నుండి వచ్చి ఆమె పార్టీలలో పాల్గొనడం నిర్లక్ష్యం క్రింద ఆమెను అందరూ జమ కట్టారు. దీనితో ఆమెపై తీవ్ర విమర్శలు రావడం జరిగింది. 
 
రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా కపూర్ కోలుకొని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తానూ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వ్యతిరేకత గురించి కనికా స్పందించారు. కోవిడ్ సోకిన తనను మరియు తన కుటుంబాన్ని అందరూ హింసించిన తీరు వెల్లడించారు. కనికా చికిత్సలో ఉండగా కొందరు ఫోన్స్ చేసేవారట. ఆ ఫోన్స్ లో విదేశాల నుండి వచ్చిన మీరు బాధ్యత లేకుండా పార్టీలలో పాల్గొన్నారు. అలాంటి మీరు చచ్చిపోవడం మంచిది అని ఫోన్స్ చేసే వారట. 
 
తనతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా వేధింపులకు గురయ్యారని కనికా తెలియజేయడం జరిగింది. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా, పిల్లలను చాలా మిస్ అయ్యారట. పిల్లలు తనకు ఫోన్ చేసీ ఎప్పుడు వస్తావు అమ్మా.. అని అంటుంటే బాధ కలిగేదని కనికా తన ఆవేదన వ్యక్తం చేశారు.