`బిగ్‌బాస్‌` షో ఇండియాలోనే చాలా ఫేమస్‌. అత్యధిక రేటింగ్‌ పొందుతున్న షో ఇది. హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు సౌత్‌కి వ్యాపించింది. తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ రన్‌ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో `బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌ జరుగుతోంది. ఇందులో అంతగా పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ ఉండటంతో అంతగా కిక్‌ ఇవ్వడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. 

మరోవైపు `బిగ్‌బాస్‌`లో పాల్గొన్న వారు బయటకు వచ్చాక దానిపై నెగటివ్‌ కామెంట్స్ చేయడం జరుగుతుంటుంది. జనరల్‌గానే `బిగ్‌బాస్‌`పై చాలా విమర్శలు వస్తుంటాయి. అయితే ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా సింగర్‌ గీతా మాధురి కామెంట్‌ చేశారు. ఓ పెద్ద సెటైరే వేశారు. 

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే `బిగ్‌బాస్‌`లో పాల్గొనండి అనే పేర్కొంది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా ఓ ఫోటోని పంచుకుంది. `ఇది రెండేళ్ళ క్రితం ఫోటో. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలునుకుంటే బిగ్‌బాస్‌కి వెళ్ళమని మీకు సలహా ఇస్తా`ను అని కామెంట్‌ చేసింది. ఇందులో గీతా చాలా సన్నగా ఉంది. రెండేళ్ల క్రితం `బిగ్‌బాస్‌ 2`లో గీతా మాధురి కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. దాన్నుంచి బయటకు వచ్చాక ఇలా సన్నగా మారింది.

తాజాగా గీతా కామెంట్స్ పెద్ద దుమారం రేపుతుంది. బిగ్‌బాస్‌ 4లో కొనసాగుతున్న సమయంలో గీతా మాధురి ఇలాంటి కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై కంటెస్టెంట్స్, `బిగ్‌బాస్‌` టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.