టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ కపుల్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు జంట మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ కపుల్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు జంట మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరు ప్రకృతి. టాలీవుడ్ లో గీతా మాధురి సింగర్ గా రాణిస్తోంది. ఇక నందు యాంకర్ గా, నటుడిగా రాణిస్తున్నారు. 

గీతా మాధురి గర్భవతి అయినప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల గీతా మాధురి సీమంతం వేడుక వైభవంగా జరిగింది. నందు అయితే స్వయంగా వంటకాలు వండి 800 మందికి అన్నదానం చేశారు. 

ఈ సంబరాలు నందు కుటుంబంలో ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. గీతా మాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా ప్రకటించారు. ఫిబ్రవరి 10నే గీతా మాధురి డెలివరీ అయింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పంచుకున్నారు. అభిమానుల ఆశీస్సులకు ధన్యావాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ప్రెగ్నెన్సీ కారణంగా గీతా మాధురి పాటలకు బ్రేక్ ఇచ్చింది. ఇకపై సింగర్ గా మళ్ళీ బిజీ కానుంది. నందు మాత్రం యాంకర్ గా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా నందు నటించిన వధువు వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. 2019లో గీతా, నందు జంటకు పాప జన్మించింది. ఎంతో అందంగా పాపకి ప్రకృతి అని నామకరణం చేశారు. ఇప్పుడు కొడుక్కి ఎలాంటి పేరు పెడతారో మరి.