Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 7: హౌస్ నుంచి దామిని అవుట్.. వేదికపై నాగ్ తో సందడి చేసిన రామ్ పోతినేని 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సండే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సండే ఫన్ డే కాబట్టి నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మేట్స్ తో గేమ్స్ మొదలు పెట్టారు.

Singer Damini eliminated from Bigg Boss 7 dtr
Author
First Published Sep 24, 2023, 10:37 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సండే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సండే ఫన్ డే కాబట్టి నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మేట్స్ తో గేమ్స్ మొదలు పెట్టారు. మొదటగా చిట్టీల గేమ్ ఆడారు. చిట్టీ తీసి అందులో ఉన్న ప్రశ్నని ఒక్కొక్క హౌస్ మేట్ ని అడిగారు. 

శోభా శెట్టిని పిలిచిన నాగ్ హౌస్ లో కన్నింగ్ ఎవరు అని అడిగాడు. దీనికి శోభా శెట్టి.. ప్రశాంత్ పేరు చెప్పింది. దీనితో వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత తేనే పూసిన కత్తి ఎవరు అని అడగగా సందీప్ మాస్టర్ అని రతిక రోజ్ తెలిపింది. కడుపు మొక్క తేజ అని శివాజీ అన్నారు. 

అనంతరం నామినేషన్స్ లో ఉన్న వారిని సేఫ్ చేసే ప్రక్రియ జరిగింది. అమర్ డీప్, ప్రియాంక, గౌతమ్, దామిని, శుభశ్రీ, రతిక నామినేషన్స్ లో ఉన్నారు. నాగార్జున ఎవరి ఫోటో ప్రేమ్ పగలగొడితే వాళ్ళు నాట్ సేఫ్. మిగిలిన వాళ్ళు సేఫ్. మొదటి రౌండ్ లో గౌతమ్, ప్రియాంక సేఫ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ కొనసాగింది. హౌస్ లో కామన్ సెన్స్ లేనిది ప్రశాంత్ అని ప్రియాంక చెప్పింది. తర్వాత మరో రౌండ్ లో నామినేషన్స్ సేఫ్ ప్రక్రియ జరిగింది. 

ఇందులో నామినేషన్స్ లో మిగిలి ఉన్న వాళ్ళకి నాగార్జున కొన్ని పౌచ్ లు ఇచ్చారు. అందులో ఎవరికీ డైమండ్స్ ఉంటె వాళ్ళు సేఫ్.. రాళ్లు వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్. ఈ రౌండ్ లో రతిక సేఫ్ అయింది. ఇంతలో ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున రామ్ కి వెల్కమ్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో స్కంద కొత్త ట్రైలర్ ని ప్రదర్శించారు. నాగార్జున స్కంద మూవీ గురించి విశేషాలు రామ్ ని అడిగి తెలుసుకున్నారు. 

ఆ తర్వాత హౌస్ మేట్స్ కి నాగార్జున డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలో రామ్ మార్కులు ఇవ్వడం విశేషం. కాసేపు రామ్ హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడారు. అనంతరం రామ్ హౌస్ ని వదిలి వెళ్లారు. ఇక నామినేషన్స్ లో అమర్, శుభశ్రీ, దామిని మిగిలారు. నాగార్జున ఒక మ్యాజిక్ డికాక్షన్ ని తీసుకుని అందులో మిల్క్ కలుపుతా అని చెప్పారు. అప్పుడు ఎవరి పేరు కనిపిస్తే వాళ్ళు సేఫ్. నాగ్ మిల్క్ పోయగానే అమర్ డీప్ పేరు కనిపించింది. దీనితో అమర్ డీప్ సేఫ్ అయ్యాడు. 

ఫైనల్ గా నామినేషన్స్ లో మిగిలింది శుభశ్రీ, దామిని. ఇద్దరినీ నాగార్జున సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు. ఇద్దరి ఫోటోలు ఉన్న రెండు షిప్ బొమ్మలు ఉన్నాయి. ఎవరి షిప్ బొమ్మ పేలిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు. నాగార్జున కౌండౌన్ ఫినిష్ చేయగానే దామిని షిప్ బొమ్మ పేలింది. దీనితో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది. దామిని ఎలిమినేట్ కాగానే ప్రియాంక జైన్ కంటతడి పెట్టుకుంది. కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. హౌస్ మేట్స్ ఎమోషనల్ గా ఆమెకి సెండాఫ్ ఇచ్చారు. 

నాగార్జున దామినిని వేదికపైకి పిలిచారు. వేదికపై హౌస్ మేట్స్ బెలూన్స్ ఉంచారు. దామిని ఒక్కక్క బెలూన్ బ్లాస్ట్ చేస్తూ వారికీ సలహాలు ఇచ్చింది. అయితే శివాజితో చిన్న వాదన జరిగింది. తాను సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు శివాజీ చెప్పిన విషయాన్నీ దామిని ప్రస్తావించింది. దీనితో శివాజీ మాట్లాడుతూ.. నీవు మొదటి వర్మ మాత్రమే గేమ్ ఆడావు.. ఆ తర్వాత నీ గేమ్ నువ్వు ఆడలేదు అని ముఖం మీదే చెప్పేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios