ప్రముఖ సింగర్ చిన్మయి తన పట్ల జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకు ఇప్పుడు పని దొరకనివ్వకుండా చేస్తున్నారని బాధ పడుతోంది. తమిళసాహిత్య రచయిత వైరముత్తు తన పట్ల ప్రవర్తించిన తీరుని వెల్లడిస్తూ ఇటీవల చిన్మయి కొన్ని విషయాలను బయటపెట్టింది.

దీని కారణంగా సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారని వెల్లడించింది. ట్విట్టర్ రోజుకి వందలాది మెసేజ్ లు వస్తున్నాయని, కావాలనే తనపై కామెంట్లు చేస్తున్నారని తెలిపింది. తన పట్ల ద్వేషపూరిత, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇప్పుడు సమస్య రాజకీయాల వరకూ వెళ్లిందని తెలిపింది.

తన స్నేహితులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారని, జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. అన్ని విషయాలు బయటపెడుతున్నాననే కారణంగా పని లేకుండా పోయిందని, అయినా పర్వాలేదని తెలిపింది.

ఇతర భాషలకు చెందిన చిత్రపరిశ్రమల్లోనూ పని చేస్తున్నానని ఎక్కడో దగ్గర పని దొరక్కుండా పోదని వెల్లడించింది. తనకు నచ్చిన పని నుండి దూరం చేయడం ఎంతగానో బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.