మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ఈసారి ఇండియాన్ లేడీస్ డ్రస్ కల్చర్ మీద ఆమో కాస్త వివాదం చెలరేగేల మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ క్యాండిడేట్లలో సింగర్ చిన్మయి కూడా ఒకరు. ముఖ్యంగా మహిళల హక్కులు, సెక్స్, నెపొటిజం, కాస్టింగ్ కౌంచ్ లాంటి వాటి విషయంలో.. వెంటనే స్పందిస్తుంది స్టార్ సింగర్. అంతే కాదు. సోల్ మీడియా వేదికగా ప్రశ్నించడం.. గట్టిగా నిలదీయ్యడం. తిట్టడం ఇలా చాలా రాకాలుగా చిన్మయి ఫేమస్. ఇలా స్పందిస్తుంది కాబట్టే.. వివాదాస్పద సెలబ్రిటీగా ఆడియన్స్ కు ఆమె గుర్తుండిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో.. స్పందిస్తూ.. సోషల్ మీడియాల యాక్టీవ్ గా ఉండే చిన్మయి.. తాజాగా మరో వివాదాస్పంద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి చిన్మయి సంచలన కామెంట్స్ చేశారు. ఓ యువకుడు ఆడవారి డ్రెస్ స్టైల్ గురించి చేసిన వీడియో గురించి మాట్లాడుతూ.. చిన్మయి కౌంటర్ ఇచ్చారు. ఆడవారు డ్రెస్‌ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని.. వారు వేసుకోవడంమానేశారు కాబట్టి.. తాను వేసుకుంటానని...నిరసన గా చున్నీ వేసుకునిచూపించాడు. ఈవీడియో గురించి స్పందించింది సింగర్ చిన్మయి. తనదైన శైలిలో స్పందిస్తూ.. అతనికి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలని చిన్మయి అన్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్‌ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు. అప్పటివరకు అసలు జాకెట్లు వేసుకునే కల్చర్ ఇండియాలో లేదన్నారు. అసలు ఆడవారు జాకెట్ వేసుకునేవారు కాదన్నారు. కాని చీరను జాకెట్‌గా మడిచి ధరించేవారని పేర్కొన్నారు. చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోవాలని చిన్మయి డిమాండ్ చేశారు.
బ్రిటీస్ కాలంలో ఇండియన్ లేడీస్ జాకెట్ లేకుండా ఉండేవారని. అది చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. లేడీస్ ను అలా బ్లౌజ్ లేకుండా చూస్తే వాళ్లకు కలిగిన లైంగిక కోరికల వల్ల.. ఇబ్బందులు పడ్డ భారతీయ మహిళలు.. అప్పటి నుంచీ జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారని చిన్మయి వెల్లడించారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదన్నారు. అసలు చెప్పాలంటే బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్ అని.. మన ఇండియన్ కల్చర్ కాదని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు విషయం తెలసుకోవాలన్నారు. ఆడవారి విషయంలో ప్రతీ దాన్ని కామంతో చూడొద్దని చిన్మయి కోరారు.
