బిజు నారాయణన్ గాయకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. పలు భాషల్లో బిజు  నారాయణన్ 400 పైకేగా పాటలు పాడారు. మంగళవారం రోజు బిజు నారాయణన్ సతీమణి శ్రీలత(44) మృతి చెందారు. దీనితో నారాయణన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

గత కొంతకాలంగా శ్రీలత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బిజు  నారాయణన్, శ్రీలత లది ప్రేమ వివాహం. ఎర్నాకులంలోని మహా రాజా కళాశాలలో వీరిద్దరూ క్లాస్ మేట్స్. అక్కడ ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో 1998లో వివాహం చేసుకున్నారు. 

వీరిద్దరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు సిద్దార్థ్ సంగీతంపై మక్కువతో డీజేగా మారాడు. చిన్న కొడుకు సూర్య స్కూల్ స్టూడెంట్. కాగా శ్రీలత అంత్యక్రియలు నేటి సాయంత్రం 7 గంటలకు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. పలుమార్లు క్యాన్సర్ చికిత్స చేయించుకున్నా శ్రీలతకు నయం కాలేదు. అందువల్లనే ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు తెలుస్తోంది. బిజు నారాయణన్ 1993లో గాయకుడిగా తన కెరీర్ ప్రారంభించారు.