దేశంలోని పలు భాషలలో వేల పాటలు పాడిన సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ శ్వేతా అగర్వాల్ మెడలో ఆదిత్య నారాయణ్ మూడు ముళ్ళు వేశారు. ముంబైలోని టిస్కాన్ టెంపుల్ లో మంగళవారం వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం. 

నటుడిగా, సింగర్ గా మరియు బుల్లితెర వ్యాఖ్యాతగా పాపులారిటీ తెచ్చుకున్న ఆదిత్య నారాయణ్ హీరోయిన్ శ్వేతా అగర్వాల్ ని పదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు సమాచారం. మొదటిసారి ఆదిత్య మరియు శ్వేతా 'షాపిత్' సినిమాలో కలిసి నటిచడం జరిగింది. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారిందట. ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో వీరు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. 

ఇక ఈ వివాహ వేడుకలో బంధువులు చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంధు మిత్రులు భాజాలకు ఉత్సహంగా డాన్సులు చేశారు. ఆదిత్య నారాయణ్ తల్లి మరియు బంధువులు సరదాగా స్టెప్స్ వేశారు. ఇక ఆదిత్య నారాయణ్ తండ్రి ఉదిత్ నారాయణ్ తెలుగు ప్రేక్షకులు బాగా సుపరిచితులే. వందల సంఖ్యలో ఉదిత్ నారాయణ్ తెలుగులో సాంగ్స్ పాడారు.