బాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా ఏడాది భారీ ప్లాప్ సినిమాలు దర్శనమిచ్చాయి. కొన్ని సినిమాలు 200 కోట్ల వరకు బాగానే బిజినెస్ చేసినప్పటికీ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచేలా బాక్స్ ఆఫీస్ హిట్స్ అయితే అందుకోలేదు. ఇక ఈ ఏడాది ప్లాపులతో ఎండ్ అవుతోంది అనుకున్న బాలీవుడ్ కి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉపిరిపోసింది. 

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా బాలీవుడ్ లో సింబా గా రీమేక్ అయ్యింది. స్టైలిష్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తో 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ కథ ముందే బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. ఎన్టీఆర్ టెంపర్ సినిమా హిందీలో డబ్ చేసి టీవీల్లో అలాగే యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి వ్యూవ్స్ ని అందుకుంది. 

ఇక రణ్వీర్ అలాంటి హై వోల్టేజ్ కథలో ఎలా నటిస్తాడో అని నార్త్ జనాలు ఎట్రాక్ట్ అయ్యారు. అయితే నటనలో తారక్ స్థాయిని అందుకోలేదు గాని సినిమా టేకింగ్ ను మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేసినట్లు టాక్ వచ్చింది. దీంతో సినిమా 2018 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లలో ది బెస్ట్ ఫిల్మ్ గా స్థానాన్ని సంపాదించుకుంది.