స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ చిత్రం పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. స‌‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రం లాంచ్ అయిన నేపధ్యంలో చాలా మంది ప్రభాస్ సూపర్ హిట్ చిత్రం ఛత్రపతిని గుర్తు చేసుకుంటున్నారు. సలార్ కు ఛత్రపతి కు ఉన్న గమ్మత్తైన కనెక్షన్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏమిటా కనెక్షన్ అంటే...

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు హిందీలో సైతం ఆ సినిమా వినాయిక్ డైరక్షన్ లో రీమేక్ అవుతోంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ సినిమా సలార్ కు ప్రారంభానికి ముందే ఆ క్రేజ్ ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి ఆర్ఆర్ తర్వాత అంతటి క్రేజ్, బజ్ సంపాదించుకుంది సలార్ చిత్రమే. హింసను గ్లామర్ గా చూపించడంలో ప్రశాంత్ నిల్ కి ఆయనే సాటి. కే జి ఎఫ్ ఎఫ్ పార్ట్ 2 కి బజ్ ఉంది అంటే ఆ వైలెన్స్ ఏ మరో కారణం అని విశ్లేషకులు అంటారు. రాజమౌళి కూడా తన సినిమాల్లో సెంటిమెంట్, హింసను ఎక్కువగా నమ్ముకుంటారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తూంటారు.  

ఇక ఈ రెండు సినిమాలకు ఉన్న కనెక్షన్ అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఇది నాలుగో సినిమా. ఇలా కేవలం మూడు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మరో దర్శకుడికి గతంలో ప్రభాస్ అవకాశం ఇచ్చింది రాజమౌళికి , అదీ  చత్రపతి సినిమా కోసం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరియర్ కి బాగా ప్లస్ అయింది. అదే విధంగా నాలుగో చిత్రానికె అవకాశం సంపాదించిన ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ సినిమా కూడా ప్రభాస్ క్రేజ్ ని రెట్టింపు చేస్తుందంటున్నారు. అలాగే   ఛత్రపతి సినిమా కూడా పూర్తిగా మాస్ మసాలా యాక్షన్ . సలార్ కూడా దాదాపు అలాంటిదే కావటంతో ఈ చర్చ మొదలయ్యింది.