రవితేజ  హీరో గా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఇలియానా  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక  ఈ చిత్రం.. నవంబరు 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ పంక్షన్ నిర్వహించి ట్రైలర్‌ విడుదల చేశారు. 

ట్రైలర్  లో  సత్య, సునీల్‌, శ్రీనివాస రెడ్డిలతో కలిసి రవితేజ చేసిన అల్లరి .. ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’లను తలదన్నేలా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు కేరాఫ్ కంచరపాలెం సినిమాకు ఓ సినిమాలారిటీ ఉందనే ప్రచారం ఇండస్ట్రీలో మొదలైంది. అదేమిటంటే ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లు ఒకటేనని చెప్తున్నారు. 

కేరాఫ్ కంచరపాలెం లో వేర్వేరు పాత్రల ప్రేమ కథలు చెప్పి..చివర్లో అవన్నీ ఒకరివే అని రివీల్ చేసినట్లుగానే ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లోనూ జరుగుతుందని అంటున్నారు.  సినిమా క్లైమాక్స్ లో ...అప్పటిదాకా ముగ్గురు గా కనపడ్డ హీరో...ఒకరే చెప్పటమే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అని, ఇదో రివేంజ్ కథ అని ..తమకు చిన్నప్పుడు జరిగిన అన్యాయానికి పెద్దయ్యాక హీరో పగ తీర్చుకునేందుకు ఎంచుకున్న మార్గమే ఈ త్రిపాత్రాభినయం అని ఈ కథ గురించి వినపడుతోంది.

'ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలు పెట్టాలి…, మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు… మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు… మనలో ఉన్న బలం' అంటూ రవితేజ చెప్పే డైలాగులు కూడా ఇదే విషయం మనకు చెప్తాయి. 

ఈ చిత్రం పూర్తిగా సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతుండగా రవితేజ డిఫరెంట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.