లైఫ్ లో ఫస్ట్ టైమ్ హాస్పిటల్ బెడ్ ఎక్కినట్లు స్నేహ ఉల్లాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పింది. గత కొంత కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని అందుకే హాస్పిటల్ చేరాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. 

సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా కనిపించే సింహా హీరోయిన్ ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్ పై కనిపించడంతో ఆమె ఫాలోవర్స్ షాకయ్యారు. జ్వరం ఎక్కువవ్వడంతో మొన్నటివరకు చాలా భయపడినట్లు చెప్పిన స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడినట్లు తెలిపింది. 

అదే విధంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని బోరింగ్ గా ఉందని చెప్పింది. చివరగా తెలుగులో మడత ఖాజా సినిమాలో హీరోయిన్ గా నటించిన స్నేహ ఆ తరువాత పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చినప్పటికీ ఎక్కువగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఈ మధ్య ఫొటో షూట్స్ తో బేబీ అవకాశాలను అందుకోవాలని హాట్ స్టిల్స్ ఇస్తోంది.