కోలీవుడ్ మన్మథుడు శింబు ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అలాగే ఒకింత వివాదాస్పద హీరో కూడా. ఈ వివాదాలు, అఫైర్స్ ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపడం జరిగింది. ఇప్పుడిప్పుడే శింబులో కొంత పరివర్త వస్తుంది. వివాదాలను పక్కనపెట్టి కెరీర్ పై దృష్టి సారించాడు. నయనతారతో ఘాడమైన ప్రేమలో మునిగి తేలిన శింబు, ఏళ్ల తరబడిన సాగిన ప్రేమ తరువాత బ్రేకప్ అయ్యాడు. ఆమెతో బ్రేకప్ తరువాత శింబు యంగ్ హీరోయిన్ హన్సికను వలలో వేసుకున్నాడు. వీరిద్దరు కూడా ఓపెన్ గా ప్రేమించుకోగా పెళ్లి కూడా చేసుకోనున్నారు అని వార్తలు రావడం జరిగింది. తీరా చూస్తే ఆమె కూడా శింబు నుండి విడిపోయింది. 

తాజాగా ఈ లిస్ట్ లో హీరోయిన్ త్రిషా వచ్చి చేరింది. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం శింబుతో సన్నిహితంగా ఉంటుందని కోలీవుడ్ టాక్. వీరి ఎఫైర్ పై ఇప్పటికే అనేక కథనాలు వచ్చినా ఈ జంట నోరు మెదపలేదు. దీనితో వీరిద్దరి మధ్య ప్రేమ బంధం ఖాయమే అని కన్ఫర్మ్ చేశారు. విశేషం ఏమిటంటే వీరిద్దరి పెళ్లి వార్తలు జోరుగా వస్తున్నాయి. శింబు-త్రిషా పెళ్లి కి సిద్ధం అయ్యారని, త్వరలోనే పెళ్లి అంటున్నారు. 

త్రిషాను  శింబు పెళ్లి చేసుకోవడం ఆయన తండ్రి అయిన నటుడు, నిర్మాత టి.రాజేందర్ కి ఇష్టం లేదని సమాచారం. శింబు-త్రిషాల వివాహ విషయమై రాజేందర్ తాజాగా స్పందించిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నిర్మాతల మండలి సమావేశం సంధర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాజేంధర్ శింబు-త్రిషా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఇబ్బందిగా ఫీలయ్యారట. ఆ ప్రశ్నను దాట వేయడంతో పాటు, స్పందించడం ఇష్టం లేదన్నట్లు ఆయన ప్రవర్తించారట. దీనితో త్రిషా-శింబు పెళ్లికి సిద్దమే కానీ...రాజేంధర్ కు  ఇష్టం లేనట్లు ఉందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.