తమిళ చిత్ర పరిశ్రమలో నటీనటులకు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఆయా విభాగాలకు చెందిన మండలిలు తగు చర్యలు తీసుకుంటాయి. తాజాగా కోలీవుడ్ లో విశాల్, శింబు లతో పాటు మరో ముగ్గు నటులు చిక్కుల్లో పడ్డారు.
తమిళ చిత్ర పరిశ్రమలో నటీనటులకు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఆయా విభాగాలకు చెందిన మండలిలు తగు చర్యలు తీసుకుంటాయి. తాజాగా కోలీవుడ్ లో విశాల్, శింబు లతో పాటు మరో ముగ్గు నటులు చిక్కుల్లో పడ్డారు. ఆ వివరాలు ఏంటో చూద్ధాం.
కోలీవుడ్ లో నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా నిర్మాత ఎన్ రామస్వామి ఉన్నారు. ఆయన అధ్యక్షతన నిర్మాతల మండలి హీరో శింబు, విశాల్, అథర్వ , కమెడియన్ యోగిబాబు , ఎస్ జె సూర్య లకు రెడ్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్మాతల మండలి కానీ హీరోలు కానీ అధికారికంగా స్పందించలేదు.
ఈ ఐదుగురు నటులు నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్నప్పటికీ సహకరించడం లేదు అని ఫిర్యాదులు నమోదయ్యాయి. సరిగ్గా షూటింగ్స్ కి హాజరు కాకపోవడం.. ఆలస్యంగా సినిమా షూటింగ్స్ ప్రారంభించడం లేదా వాయిదా వేయడం లాంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో నిర్మాతల మండలి వారిపై చర్యలకు ఉపక్రమించింది.
అందులో భాగంగా రెడ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరు హీరోలు అడ్వాన్సులు తీసుకుని కూడా నిర్మాతలకు డేట్స్ ఇవ్వడం లేదనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. అందువల్లే నిర్మాతల మండలి వారికి రెడ్ నోటీసులు పంపిందట.
కొన్నేళ్ల క్రితం హీరో శింబు నిర్మాతల మండలి నుంచి రెడ్ నోటీస్ అందుకున్నారు. కానీ అప్పుడు శింబు వివాదాలు పరిష్కరించుకుని మానాడు అనే సూపర్ హిట్ మూవీలో నటించారు. ఇప్పుడు మరోసారి శింబు రెడ్ నోటీస్ వివాదంలో చిక్కుకున్నారు.
అయితే మరికొన్ని తమిళ మీడియా కథనాల ప్రకారం.. హీరోలకు ఇంకా రెడ్ నోటిసులని నిర్మాతల మండలి పంపలేదని అంటున్నారు. పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. రెడ్ నోటీసులు పంపాక హీరోల నుంచి సరైన సమాధానం రాకుంటే అప్పుడు కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
