Asianet News TeluguAsianet News Telugu

హీరో శింబు కన్నీళ్లు.. తనని కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ భావోద్వేగం

శింబు ఎమోషనల్‌ కావడం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో ఇలా మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

simbu emotional in maanaadu event
Author
Hyderabad, First Published Nov 19, 2021, 4:36 PM IST

`మన్మథ` ఫేమ్‌ శింబు(Simbu) కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనని కొందరు ఇబ్బందిపెడుతున్నారంటూ ఓ సినిమా ఫంక్షన్ వేదికగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్‌ఏ చంద్రశేఖర్‌, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్‌ ల సమక్షంలో Simbu Emotional ఎమోషనల్‌ కావడం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో ఇలా మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

శింబు హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `మానాడు` అనే సినిమా రూపొందింది. ఇది ఈ నెల(నవంబర్‌) 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. వెంకట్‌ ప్రభుతో కలిసి తాను చాలా రోజులుగా పనిచేయాలని అనుకున్నట్టు తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని తెలిపారు. ఫైనల్‌గా ఇప్పటికీ కుదిరిందని, `మానాడు` చిత్రంలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందన్నారు. సినిమాకోసం తాను ఎంతో శ్రమించినట్టు చెప్పాడు శింబు. 

సినిమాలో ఎస్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని, అంతేకాదు సినిమా విడుదల తర్వాత అది మరో స్థాయికి వెళ్తుందని చెప్పాడు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొందరు తనని టార్గెట్‌ చేశారని, కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. శింబు ఏడవడం చూసి పక్కనే ఉన్న మిగతా సినిమా టీమ్‌ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి దాన్నుంచి తేరుకుని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరు (అభిమానులు) చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు. అయితే శింబుని ఇబ్బంది పెడుతున్నదెవరు? ఎందుకు అలా ఎమోషనల్‌ అయ్యాడనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఫిల్మ్ మేకర్‌ టీ రాజేందర్‌ తనయుడిగా బాలనటుడిగా తమిళ తెరకి పరిచయం అయ్యాడు శింబు. బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. `కాదల్‌ అజివతిల్లై` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. `ఇడియట్‌` రీమేక్‌ `దమ్‌` సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2004లో వచ్చిన `మన్మథన్‌` సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో శింబు ద్విపాత్రాభినయం చేశారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన మధ్య ప్రేమలో పడటం, కెరీర్‌ ట్రాక్‌ తప్పడం, ప్రేమలో విఫలం చెందడం వంటి కారణాలతో కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు మరోసారి హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు శింబు. అందులో భాగంగా ఇప్పుడు `మానాడు`, `మహ`, `పతు థలు`, `వెండు తనింధదు కాదు`, `కరోనా కుమార్‌` సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు శింబు.

also read: Samantha: జ్ఞాపకాలు చెరిపేసినా సమంత ఒంటిపై నాగ చైతన్య గుర్తులు చెరిగిపోలేదు.. మరి వాటినేమి చేస్తుంది!

Follow Us:
Download App:
  • android
  • ios