ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా.. ఇప్పటికీ ముఖానికి రంగేసుకొని అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల వేడుకలో పాల్గొన్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ వేడుక పూర్తయిన తరువాత జరిగిన పార్టీలో బాలయ్య చేసిన హడావిడి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల పాటు దుబాయిలో జరిగిన ఈ వేడుకలకు బాలయ్యతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల ముగింపు సందర్భంగా సెలబ్రిటీలందరికీ సైమా నిర్వాహకులు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు.

రాత్రి 12 గంటలకు మొదలైన ఈ పార్టీ ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న బాలయ్య అక్కడ అందరితో కలిసిపోయి సరదాగా జోక్స్ వేసుకొని సమయం గడిపారు. పార్టీ ఎంజాయ్ చేయడంతో పాటు ఆయన డాన్సులు చేయడం ఇప్పుడు హాట్ న్యూస్ అని చెప్పాలి.

ఈ పార్టీలో పాల్గొన్న హీరోయిన్లు శ్రియ, ప్రగ్యాజైస్వాల్, అంజలి వంటి వారితో కలిసి బాలయ్య డాన్స్ చేశారట. బాలయ్య చేసిన హంగామా చూసి తమిళ, కన్నడ హీరోలు ఆశ్చర్యపోయారట. అంటే ఏ రేంజ్ లో ఆయన హడావిడి చేసి ఉంటారో ఊహించుకోవచ్చు!