మహేష్ హీరోయిన్ పెళ్లి ఈ వారంలోనే...వెన్యూ ఎక్కడంటే
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్, శంకర్ కలయికలో రూపొందుతోన్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన కియారా కు పెళ్లి సెట్ అయ్యింది. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. ఈ బిజీలోనూ పెళ్లికి డేట్స్ కేటాయించుకుంది. ఆమె తన లవర్ తోనే వివాహానికి సిద్దపడింది. ఈ మేరకు ..పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త సంవత్సరం తొలిరోజు వార్తల్లో నిలిచినవారిలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ జంట ఒకటి. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘షేర్షా’ చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. . షేర్షా సినిమాలో సిద్ధార్థ్, కియారా ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసినట్లు తెలిసింది.
ఆ తర్వాత అనేక ఈవెంట్స్‌లో సిద్ధార్థ్, కియారా సన్నిహితంగా కనిపించడం, కలిసి విహారయాత్రలకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో పలు మార్లు చక్కర్లు కొట్టాయి. సిద్ధార్థ్, కియారా ప్రేమలో ఉన్నట్లుగా కరణ్‌జోహార్, అక్షయ్‌కుమార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. వారి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని వెల్లడించారు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు కియారా పేర్కొన్నది.
ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని బాలీవుడ్ మీడియా సమాచారం. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్ టాక్. మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. మెహందీ, సంగీత్ ఒకే రోజున, ఆ మర్నాడు వివాహ వేడుకను ప్లాన్ చేశారని భోగట్టా. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సినీ ప్రముఖులకు ముంబయ్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని సిద్ధార్థ్, కియారా అనుకున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది.