సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వర్‌ జంటగా నటిస్తున్న `టిల్లు స్క్వైర్‌` మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్‌ విషయం నెట్టింట వైరల్‌ అవుతుంది.

`డీజే టిల్లు` సినిమా గతేడాది వచ్చి ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా ఊహించని సక్సెస్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందులో టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికితోడు నేహా శెట్టి గ్లామర్‌, ఆమె పాత్ర స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. థియేటర్లో ఆడియెన్స్ కి నవ్వులు పూయించింది. దీంతో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌అయ్యింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. 

దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు `టిల్లు స్వ్కైర్‌` రూపొందుతుంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన `టికెట్‌ కొనకుండానే` అనే పాట అదిరిపోయింది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 15మిలియన్స్ వ్యూస్‌ పొందింది. గ్లింప్స్ సైతం ఆకట్టుకుంది.

అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కుతున్న విసయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్ర ఔట్‌పుట్‌ విషయంలో ఓ షాకింగ్‌ రూమర్‌ నెట్టింట వినిపిస్తుంది. రష్‌ చూసి హీరో సిద్దు డిజప్పాయింట్‌ అయ్యారట.

`టిల్లు స్వ్కైర్‌` సినిమా రష్‌ విషయంలో హీరో సిద్దు జొన్నలగడ్డ అసంతృప్తిగా ఉన్నారట. ఎడిటింగ్‌ టేబుల్‌పై రష్‌ చూసినప్పుడు ఔట్‌పుట్‌ వచ్చిన తీరుకి ఆయన డిజప్పాయింట్‌ అయ్యారట. దీంతో షూటింగ్‌ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారట. దీంతో టీమ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడిందని అంటున్నారు. 

సిద్దు జొన్నలగడ్డ మళ్లీ వచ్చి షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాడా? లేక స్క్రీన్‌ప్లేని మార్చాలని కోరతాడా? అనేది యూనిట్‌లో సస్పెన్స్ నెలకొందని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఔట్‌పుట్‌పై సంతృప్తిగా లేరని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది. మరి అనుకున్న డేట్‌కే రిలీజ్‌ అవుతుందా? మార్చుతారా? అనేదిచూడాలి.