Asianet News TeluguAsianet News Telugu

`టిల్లు స్వ్కైర్‌` స్టోరీ లీక్‌ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. ఆవేశంలో అసలు విషయం బయటపెట్టాడా?

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కైర్‌` ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. యూత్‌ని పిచ్చెక్కిస్తుంది. కానీ తాజాగా టిల్లుగాడి కామెంట్లు మరింత రచ్చ అవుతుంది.

siddhu jonnalagadda leaked tillu square story at trailer event arj
Author
First Published Feb 14, 2024, 11:21 PM IST | Last Updated Feb 14, 2024, 11:21 PM IST

త్వరలో రాబోతున్న మోస్ట్ క్రేజీ మూవీ `టిల్లు స్వ్కైర్‌`. అంతకు ముందు వచ్చిన `డీజే టిల్లు` మూవీకి ఇది సీక్వెల్‌. ట్రెండీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ అయి ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. ఆ తర్వాత ఆ స్టయిల్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆ రేంజ్‌ని అందుకోలేకపోయాయి. దీంతో `డీజే టిల్లు` స్పెషల్‌గా నిలిచింది. పాటలు, డైలాగులతో సహా ఇందులో చాలా ఎలిమెంట్లు ట్రెండ్‌ని సెట్‌ చేశాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి సీక్వెల్‌ `టిల్లు స్వ్కైర్‌` వస్తుంది. అదే యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో, దాన్ని మించిన బోల్డ్ కంటెంట్‌తో ఈ మూవీ రాబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తే ఆ విసయం అర్థమవుతుంది. ఇప్పటి వరకు ట్రెడిషనల్‌రోల్స్ చేసిన అనుపమా పరమేశ్వరన్‌ ఇందులో అన్నీ బ్రేక్‌ చేసింది. గ్లామర్‌ సైడ్‌ మాత్రమే కాదు, సీన్ల పరంగానూ తనలోని 2.0 చూపించింది. లిప్‌ లాక్‌లకు అయితే అడ్డు అదుపే లేదు. వామ్మో ఇది చేసింది అనుపమనేనా అనేంతగా రెచ్చిపోవడం విశేషం. దీంతో ఈ సినిమాపై హైప్‌ అమాంతం పెరిగిపోతుంది. 

ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ శ్రీరాములు థియేటర్లో చేశారు. ఇందులో టీమ్‌ పాల్గొంది. హీరో సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ, దర్శకుడు, ఇతర నటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హీరో సిద్దు స్టోరీ లీక్‌ చేసేశాడు. అసలు కథేంటో చెప్పేశాడు. మొదటి సినిమాలో టిల్లు, రాధిక ప్రేమించుకుంటారు. టిల్లుని తన ప్రాబ్లెమ్‌ సాల్వ్ చేసేందుకు వాడుకుంటుంది. అసలు రూపం తెలుసుకున్న టిల్లు ఆమె గుట్టు బయటపెడతాడు.జైలుకి పంపిస్తాడు. కానీ సిన్సియర్‌గా ప్రేమించినందుకు హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. 

ఇందులో కూడా అదే ఉంటుందట. ఆ విషయాన్ని ఈవెంట్‌లో మాట్లాడుతూ సిద్దు తెలిపారు. ఈ సినిమాలో కూడా గుణపమ బై అనుపమా అని చెప్పాడు. అంటే ఈ సినిమాలతోనూ అనుపమా తన గుండెల్లో గుణపాన్ని దించుతుందని, మోసం చేస్తుందని చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో ఇది కూడా అలాంటి సేమ్‌ స్టోరీనే అనే విషయాన్ని కూడా సిద్దు లీక్‌ చేసేశాడు. పైగా ట్రైలర్‌లో కూడా అలాంటి అంశాలనే చూపించారు. ట్రెండీగా అనుపమాని ప్రేమించడం కారులో లిప్‌లాక్‌లతో రెచ్చిపోవడం, ఆ తర్వాత ఆమె తన సమస్య చెప్పడం, అందులో తను ఇన్‌వాల్వ్ అయి చివరికి తనే బలి కావడం వంటి సీన్లు ఉన్నాయి, పైగా ప్రతిసారి అదే విషయాన్ని సిద్దు చెబుతూనే ఉన్నాడు. 

ఈ సారి గట్టిగానే తగిలేలా ఉంది అని, మీ సమస్యలకు మమ్మల్ని లాగొద్దని ఆయన చెబుతూనే ఉన్నాడు. దీంతో సినిమా స్టోరీ ఏంటో క్లారిటీ వచ్చింది. ఇక ఆడియెన్స్ ని ఎలా నవ్విస్తారో అనేది ఇందులో మెయిన్‌ పాయింట్‌. అది సినిమా చూస్తే గానీ తెలుస్తుంది. కానీ డైలాగ్‌లు మాత్రం చాలా లైవ్లీగా ఉన్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి.యూత్‌కి మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సిద్దు, అనుపమా జంటగా నటించగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. మార్చి 29న ఈ మూవీ విడుదల కాబోతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios