సరికొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే దర్శకుడు విక్రమ్ కుమార్ 'హలో' సినిమా తరువాత మరే సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఆయన ఓ సినిమా చేయాల్సివుంది కానీ కథలో సెకండ్ హాఫ్ సరిగ్గా కుదరకపోవడంతో వీరి కాంబినేషన్ అటకెక్కింది.

దీంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇది ఇలా ఉండగా.. విక్రమ్ కుమార్ తన దగ్గరున్న కథతో నాని హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. నానికి కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో నాని ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ కథను మల్టీస్టారర్ గా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. అతడే సిద్ధార్థ్. తెలుగులో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన సిద్ధార్థ్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి వెళ్లిపోయాడు. రీసెంట్ గా ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు.

ఇప్పుడు నాని సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సిద్ధార్థ్ హీరోగా కాదు విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట, ఆఫ్ స్క్రీన్ నాని, సిద్ధార్థ్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరినీ తెరపై ప్రత్యర్దులుగా చూపించబోతున్నారు. లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు విలన్ గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి!