అమ్మాయి వల్లే కెరీర్, ప్రెండ్షిప్ నాశనం..దాంతో నెగిటివ్ గా సిద్దార్ద్?
ఈ చిత్రాన్ని 'ఆర్.ఎక్స్ 100'తో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేయనున్నారు. దాంతో జనాలు సంగతేమో కానీ సిద్దార్ద్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే సిద్దార్ద ఈ సినిమాలో హీరోగా కనపడతాడా అంటే ...లేదని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు.
చాలా గ్యాప్ తర్వాత సిద్దార్ద్ తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. శర్వానంద్ హీరోగా రూపొందే 'మహా సముద్రం' లో సిద్ధార్థ్ కీలకమైన పాత్రలో కనిపించబోతన్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'ఆర్.ఎక్స్ 100'తో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేయనున్నారు. దాంతో జనాలు సంగతేమో కానీ సిద్దార్ద్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే సిద్దార్ద ఈ సినిమాలో హీరోగా కనపడతాడా అంటే ...లేదని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. అంటే సిద్దార్ద విలనిజం పండించబోతున్నాడట. అయితే సాఫ్ట్ విలన్ గా కనిపిస్తాడట. ఇంతకాలం లవర్ బాయ్ లా కనిపించి అలరించిన సిద్దార్థ్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘మహాసముద్రం’ సినిమా లైన్ కాస్త డిఫరెంట్ గానే ఉంటుందిట.‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో ఓ అమ్మాయి వల్ల ఓ కుర్రాడి జీవితం ఎలా నాశనం అయిపోయింది అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు అజయ్. ‘మహాసముద్రం’ చిత్రంలో కూడా ఓ అమ్మాయి వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా విడిపోయారు.. వాళ్ళ కెరీర్ ఎలా నాశనం అయిపోయింది’ అనే లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఇందులో ఇద్దరు ప్రాణ స్నేహితులుగా శర్వానంద్, సిద్దార్థ్ లు నటిస్తున్నారు. ముఖ్యంగా హీరో సిద్దార్థ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కాగా.. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌ను గోవాలో ప్రారంభించబోతున్నారట. 'శ్రీకారం' తర్వాత శర్వానంద్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. హీరో సిద్ధార్థ్ 8 ఏళ్ల తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రమిది.