టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సిద్ధార్థ్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే సినిమాలు చేసుకుంటున్న ఈ నటుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

తాజాగా సీనియర్ నటుడు రాధారవి.. నయనతారపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలివుడ్ మొత్తం రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ వ్యవహారం స్పందించిన సిద్ధార్థ్.. మీటూ విషయంలో సైలెంట్ గా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు నయనతార విషయంలోనే ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్ధం కావడం లేదని, కాస్టింగ్ కౌచ్ విషయంలో సైలెంట్ గా ఉన్నవాళ్లకు మద్దతు తెలపడంలో ఆంతర్యం వాళ్లకే తెలియాలని ఘాటుగా స్పందించాడు.

ఈ పోస్ట్ చూసిన నయన్ బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేశ్ శివన్ అసహనం వ్యక్తం చేశారు. నయనతార మీటూ బాధితులకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించిందని, ఆర్థికంగా కూడా వారిని ఆదుకుందని కానీ తనకు అటువంటి విషయాలను పబ్లిసిటీ చేసుకొనే మార్గం తెలియదంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.