సిద్ధార్థ్ ‘చిన్నా’OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. !?
తమిళ్ లో చిత్తా అనే పేరుతో ఆల్రెడీ రిలీజయి పర్వాలేదనిపించిన ఈ సినిమా నేడు తెలుగులో చిన్నా అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాని సిద్దార్థ్ స్వయంగా నిర్మించారు.

తమిళంలో ‘చిత్త’గా విడుదలై ఘన విజయం సాధించిన సినిమా తెలుగులో ‘చిన్నా’గా వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత తమిళంలో సిద్ధార్థ్‌కు హిట్ దక్కింది. చిత్త సినిమా తెలుగు వెర్షన్ ‘చిన్నా’మాత్రం వర్కవుట్ కాలేదు. ఎమోషనల్ మూవీగా ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా భాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఈ సినిమాని సిద్దార్థ్ స్వయంగా నిర్మించారు. టైట్ స్క్రీన్ ప్లే తో, ఎమోషనల్ కంటెంట్ తో కథని నడిపిచినా జనాలను రీచ్ కాలేదు. చైల్డ్ అబ్యూజింగ్, హరాజ్మెంట్, చైల్డ్ రేప్ కేసెస్.. ఇలాంటి కంటెంట్ ని చూపించడంతో తెలుగు వారు ఇబ్బంది ఫీలయ్యారనే చెప్పాలి. అందుకే ఇక్కడ మౌత్ టాక్ స్ప్రెడ్ కాలేదు.
సమాజంలో జరిగే ఇలాంటి వాటిపై సినిమా తీసి నిందితుల వైపే కాకుండా అలాంటి పరిస్థితులు ఎదుర్కున్న పిల్లల భవిష్యత్తు ఏంటి అని చివర్లో ఒక పాజిటివ్ పాయింట్ తో సినిమా ఎండ్ చేయటం కొందరికి నచ్చినా తెలుగులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా చిత్త (చిన్నా) సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను లాక్ చేసుకుంది. చిత్త సినిమా డిటిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ దక్కించుకుంది. ఈనెల (అక్టోబర్) చివర్లో డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. చిత్త సినిమాకు ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో ఓ జాబ్ చేసుకుంటూ సింపుల్ జీవితాన్ని గడిపేస్తుంటాడు హీరో ఈశ్వర్(సిద్ధార్థ్). ఓ పక్క చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేయడం, చంపేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అదే సమయంలో హీరో తన ఇంటి దగ్గరే ఉండే మరో పాపతో మాములుగా మాట్లాడినా అది తప్పుగా తీసుకొని ఈశ్వర్ కూడా ఇలాగే చేస్తాడు అని అంతా అనుకోని కొట్టి పోలీసుల అరెస్ట్ వరకు వెళ్తుంది. కానీ తర్వాత ఈశ్వర్ అన్న కూతురు కనిపించకపోవడంతో ఈశ్వర్, అతని ఫ్రెండ్స్, పోలీసులు పాపని ఎలా వెతికి పట్టుకున్నారు, ఇలాంటి పనులు చేసినవాడ్ని పట్టుకున్నారా అనేది తెరపై చూడాల్సిందే.
చిత్త తెలుగు వెర్షన్ చిన్నా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సిద్ధార్థ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని, తెలుగు వెర్షన్ హక్కులను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఇదే బెస్ట్ సినిమా అని ఆయన చాలాసార్లు చెప్పారు. ఎట్టకేలకు తెలుగులో చిన్నా పేరుతో ఈ సినిమా అక్టోబర్ 6న రాగా మంచి స్పందన దక్కించుకుంది. చిత్త సినిమాను సిద్ధార్థ్ స్వయంగా నిర్మించారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్ సంగీతం సమకూర్చారు.