అదితీరావ్‌ హైదరి, సిద్దార్థ్‌ మరోసారి తమ బంధం గురించి నోటితో చెప్పకుండానే క్లారిటీ ఇచ్చేశారు. కాని డైరెక్ట్ గా మాత్రం బయటపడటంలేదు ఇద్దరు తారలు. తాజాగా న్యూ ఇయర్  కోసం రొమాంటిక్ ట్రిప్ లో ఉన్నారు జంట.  


అవ్వడానికి తమిళ హీరో అయినా.. తెలుగు స్పస్టంగా మాట్లాడుతూ.. తెలుగు కుర్రాడే అనిపించుకున్నాడు సిద్దార్ధ్. టాలీవుడ్‌ ప్రేక్షకులకు బొమ్మరిల్లు సిద్దు గా తెలిసిన ఈ హీరో.. టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలు చేశాడు. అందుకే సిద్దు గురించి పెద్దగా ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. . బొమ్మరిల్లు తో మొదలు పెట్టి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బావా లాంటి సినిమాలతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బొమ్మరిల్లు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సిద్దార్థ్‌ టాలీవుడ్ పై చేసిన కొన్నివ్యాఖ్యల కారణంగా ఇక్కడ ఇమేజ్ ను డామేజ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో ఫామ్ నుకోల్పోయాడు. 

ఇక ఇఫ్పుడిప్పుడే తెలుగులో సినిమాలు మొదలు పెట్టాడుసిద్దు. కాని ఏం లాభం లేదు.. ఏ సినిమా చేసినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈక్రమంలో సిద్దు రీ ఎంట్రీలో.. మహా సముద్రం లాంటి మూవీస్ తో ముందుకు వచ్చాడు. ఈసినిమా డిజాస్టర్ అయినా.. సిద్దుకు టాలీవుడ్ లోకి రూట్ క్లియర్ చేసింది. ఈసినిమాలో శర్వానంద్ తో కలసి నటించాడు సిద్దార్ధ్. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన అదితీరావ్‌ హైదరి తో ప్రేమాయణం మొదలు పెట్టాడు హీరో. ఏం మాయ చేశాడో కాని.. ప్రస్తుతం ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ సిద్దార్థ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ.. నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంది. కాని ఈ విషయాన్ని మాత్రం ఇద్దరు బయట పెట్టలేదు. ..ఒప్పకోలేదు. 

View post on Instagram

గత కొన్నాళ్లుగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. సినిమా ఈవెంట్స్ కి కలిసే వెళ్తున్నారు. కలిసి రీల్స్ కూడా చేస్తున్నారు. ఇక అందరికి తెలిసిపోయిందిలే అనుకున్నారో ఏమో.. ఇంకాస్త అడ్వాన్స్ అయ్యారు స్టార్ కపుల్. ఈమధ్య ఇద్దరు కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు. కాని తమ మధ్య ఏమీ లేదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. అసలు విషయం ఒప్పుకోవడంలేదు. రీసెంట్ గా సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. పుట్టిన రోజులకు ఒకరికొకరు తమ సోషల్ మీడియాలో స్పెషల్ విషెష్ చెప్తున్నారు. 

తాజాగామరో అడుగు ముందుకు వేసి.. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. ఏకంగా విదేశాలకు వెళ్లారు ఇద్దరూ. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలా ఇద్దరూ కలిసి ఫోటో పోస్ట్ చేయడంతో ఇక అపీషియలో గా మేమ్ రిలేషన్ లో ఉన్నాం అని ప్రకటించినట్టే అని అనుకుంటున్నారు ఆడియన్స్. ఇక పెళ్ళెప్పుడు అని కామెంట్లు కూడా చేస్తున్నారు.