అంతా తూచ్.. పెళ్లి కాదు, ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావు హైదరీ.. రింగులు చూపిస్తూ పోస్ట్
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇద్దరికి పెళ్లైపోయిందని అంతా భావించిన నేపథ్యంలో అది కాదంటూ మరో ట్విస్ట్ ఇస్తూ సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చారు.
సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ఇప్పుడు హాట్ కపుల్ అయ్యారు. ఈ ఇద్దరు రెండు రోజులుగా సోషల్ మీడియాని, మెయిన్‌స్ట్రీమ్ మీడియాని ఊపేస్తున్నారు. వీరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడమనేది హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా దీనిపై స్పందించారు సిద్ధార్థ్. పెళ్లికి సంబంధించిన వార్తలకు ఫుల్ స్టాప్ చెప్పాడు. ఒక్క పోస్ట్ తో అంతా తలకిందులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన హంగామా మొత్తం తూచ్ అనిపించాడు.
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఇద్దరు కలిసి తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఒకరికొకరు ఓకే చెప్పినట్టు వెల్లడించారు. అంతేకాదు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్దరు పోస్ట్ లు పెట్టడం విశేషం. ఇద్దరు కలిసి తన చేతి రింగులు చూపిస్తూ, ఆమె తనక ఎస్ చెప్పిందని సిద్ధార్థ్, అతను తనకు ఎస్ చెప్పాడని అదితి పోస్ట్ పెట్టడం విశేషం. మొత్తానికి ఈ జంట సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మరి పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. మొత్తానికి సిద్ధార్థ్ మూడోసారి, అదితి రెండో సారి పెళ్లికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే సిద్ధార్థ్, అదితి రావు హైదరీ మ్యారేజ్ చేసుకున్నట్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. రహస్యంగా మ్యారేజ్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. అంతా కోడై కూసింది. కానీ అది నిజం కాదు. అదంతా ఓ సినిమా కోసం జరిగిన తంతు అట. ఆలయంలో సిద్ధార్థ్, అదితిలపై పెళ్లి సీన్ తీస్తున్నారట. ఈ క్రమంలోనే అక్కడ ఈ ఇద్దరు మెరిశారట. అయితే అందులో నిజంగానే పెళ్లిజరిగిందని, తమిళ పూజారులు చేశారని ఆలయ నిర్వహకులు తెలపడం గమనార్హం. మరి ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అంటూ ఈ ఇద్దరు అనౌన్స్ చేశారు. ఈ కన్‌ఫ్యూజన్ అందరికి షాకిస్తుంది.
అయితే సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కలిసి నిజంగానే ఓ మూవీ షూటింగ్‌లో నటిస్తున్నారు. గతంలో వీరు `మహాసముద్రం` అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇన్నాళ్లు డేటింగ్ చేశారు. ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది ఈ హాట్ కపుల్.