Asianet News TeluguAsianet News Telugu

Sid Sriram : అమ్మో ‘సిద్ శ్రీరామ్’ ఒక్క పాటకు అంత తీసుకుంటాడా..! అయినా సరే అంటున్న ప్రొ డ్యూసర్స్..


తెలుగు ప్రేక్షకులకు తన గాత్రంతో మరో లోకంలోకి తీసుకెళ్లే సిద్ శ్రీరామ్ గాత్రానికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. తనతో పాడించేందుకు ప్రొడ్యూసర్లు కూడా ఖర్చుకు వెనకాడటం లేదు. 

Sid Sriram Takes Big Amount for A Song.!, Social Media Post
Author
Hyderabad, First Published Jan 24, 2022, 10:59 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం, భారీ బడ్జెట్ లో ఏ సినిమా  చేయబోతున్న అందులో ‘సిద్ శ్రీరామ్’తో ఓ పాట పాడించాలని భావిస్తున్నారు. ఆయన పాడితే వచ్చే రెస్పాన్సే వేరు. అందుకే సిద్ శ్రీరామ్ కోసం సినిమాలు వరుసగా క్యూగడుతున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సిద్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ స్థాయి సినిమా అయినా సంగీతం వరకు వస్తే తన గాత్రం అందించడంలో ఎక్కడా హెచ్చు తగ్గులు కనిపించవు. 

సిద్ శ్రీరామ్ పాటపాడితే కచ్చితంగా ఆడియోన్స్ మెచ్చి తీరాల్సిందే.  పదే పదే వినాల్సిందే. మరోవైపు ఆయనతో పాట పాడిస్తేనే ఆ సినిమా కూడా హిట్ అవుతుందనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో సిద్ తో పాటలు పాడించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఎంత ఖర్చైనా సరే సిద్ శ్రీరామ్ పాట పాడించాల్సిందేనంటున్నారు. 

మరో ప్రక్క ఈ  సింగర్ కాస్తా కంపోజర్‌ అయ్యారు. మణిరత్నం ‘కడల్‌’ సినిమాతో సింగర్‌గా మారిన సిద్ మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా ద్వారానే సంగీత దర్శకుడిగా మారాడు. విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా ధన దర్శకత్వంలో మణిరత్నం నిర్మించనున్న చిత్రం ‘వానమ్‌ కొట్టట్టుమ్‌’. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు సిద్ శ్రీరామ్‌. తొలుత ఈ సినిమాకు ‘96’ ఫేమ్‌ గోవింద్‌ వసంత సంగీత దర్శకుడు. డేట్స్‌ క్లాష్‌ కావడంతో సిద్ శ్రీరామ్‌ ట్యూన్స్‌ అందించడానికి రెడీ అయ్యారంట.  

అయితే ప్రస్తుతానికి మాత్రం అతడి గాత్రంలోనే ఏదో మ్యాజిక్‌ ఉందంటున్నారు.  అతడు పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి. టాక్సీవాలా'లో ‘మాటే వినదుగా..’, అల వైకుంఠపురములో'  ‘సామజవరగమన’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? లో ‘నీలి నీలి ఆకాశం..’, నల్లమలలోని ‘యేమున్నవే పిల్లా’, వకీల్‌ సాబ్‌లో ‘మగువా మగువా’.. రాహూలో ‘ఏమో ఏమో’ మొన్నటి ‘పుష్ప’లోనూ ‘శ్రీవల్లి’, బంగార్రాజులోని ‘నా కోసం’ పాట పాడి తన  క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. అంతేగాక ఆ సినిమాలన్నీ సక్సెస్‌ కావడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది. 

మనస్సుకు హాయిని గలించేలా పాటలు పాడుతున్న సిద్‌ శ్రీరామ్‌ ఒక్క పాటకు భారీగానే తీసుకుంటున్నారు.  రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు తీసుకుంటున్నాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఉండే అవకాశం లేదు. కానీ సిద్  శ్రీరామ్ స్మాల్ సెలెబ్రెటీల మారిపోవడం, తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం మూలంగా తాను పాడిన ప్రతి పాట హిట్ గా నిలుస్తోంది.  ఈ విషయాన్ని గమనించిన నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్‌ శ్రీరామ్‌తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నట్టు సమచారం. 

అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’, అడివి షేషు నటిస్తన్న ‘మేజర్’ మూవీలోనూ ప్రేక్షకులకు తన  గొంతును వినిపంచనున్నారు. వీటితో పాటు ఈ ఏడాది రానున్న ఆకాశ వీదుల్లో,   సెహరీ, చకోరీ లాంటి మూవీల్లోనూ పాటలు పాడాడు సిద్ శ్రీరామ్.

Follow Us:
Download App:
  • android
  • ios