సౌత్ లో ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ సిద్ శ్రీరామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నాడు. ఏఆర్. రెహమాన్ సాంగ్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సిద్ గీతగోవిందం సాంగ్స్ తో టాలీవుడ్ మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సింగర్ గత కొన్నేళ్లుగా సంగీత దర్శకుడవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఫైనల్ గా మణిరత్నం నిర్మించనున్న మల్టీస్టారర్ ద్వారా ఈ కుర్ర సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. జివి.ప్రకాష్ కుమార్ - విక్రమ్ ప్రభు - మడోన్నా సెబాస్టియన్ వంటి స్టార్స్ కలిసి నటిస్తున్న 'వానం కొట్టాటూమ్' అనే తమిళ్ సినిమాకు ధనా శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన శేఖర్ ఈ సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నాడట. మొదట ఈ సినిమాకు 96 ఫెమ్ గోవింద్ వసంతని సంగీత దర్శకుడిగా అనుకోగా అనంతరం సిద్ శ్రీరామ్ కి అవకాశం ఇచ్చారు.