Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ పెళ్లి గురించి శ్యామల దేవి కామెంట్స్.. మరోసారి హాట్ హాట్ గా చర్చ

కల్కి కూడా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి. బాహుబలి చిత్రం నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. 

Shyamala Devi interesting comments on Prabhas marriage dtr
Author
First Published Jul 8, 2024, 2:42 PM IST

కల్కి కూడా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నెవర్ ఎండింగ్ స్టోరీ అనే చెప్పాలి. బాహుబలి చిత్రం నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. కృష్ణం రాజు గారు ఉన్నప్పుడు ఆయనకి ఈ ప్రశ్న ఎదురయ్యేది. ఆయన లేరు కాబట్టి శ్యామలాదేవిని మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్ళెప్పుడు అని యాంకర్ ప్రశ్నించారు. ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. అది ఎప్పుడనేది తెలియదు.ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నారో మీరే చూస్తున్నారు కదా అని శ్యామలాదేవి అన్నారు. 

సరైన టైం పెళ్లి కూడా జరుగుతుంది అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్ళు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. సినిమా తర్వాత మరో సినిమాకి కమిటవుతూ బిజీగా గడుపుతున్నాడు. 

కల్కి చిత్రం 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కల్కి తర్వాత ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios