Asianet News TeluguAsianet News Telugu

Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్ 2' పవన్ కళ్యాణ్ చేస్తే థియేటర్లు పగిలిపోతాయి.. డైరెక్టర్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. సినీ హీరోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కు నాయకుడిగా కూడా ఇమేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'శ్యామ్ సింగ రాయ్' చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Shyam Singha Roy Director rahul interesting comments on Pawan Kalyan
Author
Hyderabad, First Published Dec 25, 2021, 5:45 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. సినీ హీరోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కు నాయకుడిగా కూడా ఇమేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'శ్యామ్ సింగ రాయ్' చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నాని హీరోగా నటించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. శ్యామ్ పాత్రలో నాని అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే సాయి పల్లవి కూడా ఎప్పటిలాగే నటనతో కట్టిపడేసినట్లు చెబుతున్నారు. ఇక దర్శకుడు రాహుల్ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 

ప్రతి ప్రేముని రాహుల్ కళాత్మకంగా తీర్చిదిద్దినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా రాహుల్ శ్యామ్ సింగ రాయ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో నాని శ్యామ్ పాత్రలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే రోల్ లో కనిపిస్తాడు. ఈ తరహా చిత్రం పవన్ ఇమేజ్ కు సరిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

రాహుల్ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు స్వతహాగానే ఫైర్ ఉన్న వ్యక్తి. రియల్ లైఫ్ లో ఆయన శ్యామ్ సింగ రాయ్. ఇలాంటి సబ్జెక్టుని పవన్ కళ్యాణ్ గారితో తీస్తే థియేటర్లు పగిలిపోతాయి అంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ శ్యామ్ సింగ రాయ్ పార్ట్ 2 ఉంటే పవన్ కళ్యాణ్ గారితో చేస్తా ని రాహుల్ అన్నారు. 

శ్యామ్ సింగ రాయ్ చిత్రం నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో నటించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. 

Also Read: అనసూయపై అసభ్యకర కామెంట్స్.. యూట్యూబ్ ఛానల్స్ కి గట్టిగా ఇచ్చింది

Follow Us:
Download App:
  • android
  • ios