సారాంశం
`కొత్త బంగారులోకం` ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు వరుసగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ, టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడింది శ్వేత. ప్రేమించి రోహిత్ మిట్టల్‌ని పెళ్లి చేసుకున్నానని, కానీ ఏడాదిలోపే విడిపోయామని చెప్పింది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడించింది.
`కొత్త బంగారులోకం` ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు వరుసగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ, టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడింది శ్వేత. ప్రేమించి రోహిత్ మిట్టల్‌ని పెళ్లి చేసుకున్నానని, కానీ ఏడాదిలోపే విడిపోయామని చెప్పింది. అయితే తాము విడిపోవడాన్ని విడాకులు అనే పెద్ద పదాలు వాడడం వద్దని, జస్ట్ బ్రేకప్ లాంటిదని చెప్పింది.
ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది శ్వేత. ఇప్పుడు తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, `లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లని చవిచూశానని, ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇప్పుడే స్వేచ్ఛగా ఉన్నానని చెప్పింది. భర్తతో విడాకులు తీసుకున్నాక అసలైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు చెప్పింది. తన మ్యారేజ్ లైఫ్ కేవలం ఎనిమిది నెలల్లోనే ముగుస్గుందని ఊహించలేదని, ఏదేమైనా ఇప్పుడు జీవితం హాయిగా గడుపుతున్నట్టు చెప్పింది శ్వేత.
బాలీవుడ్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి జాతీయ అవార్డుని అందుకున్న శ్వేత.. తెలుగులో `కొత్త బంగారులోకం` చిత్రంతో ఫేమస్ అయ్యింది. పలు తెలుగు, హిందీ సినిమాల్లో మెరిసింది. అవకాశాలు తగ్గిపోవడం, ఆమె వ్యభిచార కేసులో ఇరుక్కుని కొన్నాళ్లపాటు జైలు జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డా శ్వేత.. ఆ తర్వాత నెమ్మదిగా దాన్నుంచి బయటపడి, మళ్లీ కెరీర్‌ని ప్రారంభించాలనుకునే సమయంలో బాలీవుడ్ కి చెందిన రోహిత్ మిట్టల్‌తో ప్రేమలో పడింది. ఆయన్నుంచి ఏడాదిలోపే విడాకులు తీసుకుంది.
ప్రస్తుతం శ్వేత.. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో `ఇండియా లాక్‌డౌన్` చిత్రంలో నటిస్తుంది. కరోనా కాలంలో వ్యభిచారం నిర్వహించే మహిళల జీవితాలు ఎలా ఉన్నాయనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని, ఇందులో శ్వేత సెక్స్ వర్కర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. అందులో భాగంగా కామథిపూరలో వ్యభిచారం నిర్వహించే మహిళలను ఇటీవల కలిశారు శ్వేత, మధుర్ భండార్కర్.