ప్రతి వారం ఎన్నో వినూత్న కథలు వెండితెరపై పోటీ పడుతున్నాయి. అయితే అందులో డిఫరెంట్ కథలనే ఎక్కువగా ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. గత కొన్ని రోజులుగా 'శుభలేఖ+లు' అనే సినిమాకు సంబందించిన టాక్ కూడా బాగా వైరల్ అవుతోంది. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు డిఫరెంట్ గా ఉండటంతో సినిమాకు ఆదరణ పెరుగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. 

బోయపాటి శ్రీను - వంశీ పైడిపల్లి వంటి స్టార్ దర్శకుల దగ్గర స్టూడెంట్ గా ఉన్న శరత్ నర్వాడే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటులందరూ కొత్తవారే. హనుమా  తెలుగు మూవీస్ బ్యానర్ లో సి.విద్యాసాగ‌ర్‌,జ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. 

ఇకపోతే రీసెంట్ గా సెన్సార్ పనులను ముగించుకున్న ఈ సినిమాను పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత  బెల్లం రామకృష్ణా రెడ్డి వీక్షించి ఫ్యాన్సీ రేటుకు సినిమా హక్కుల్ని కొనుగోలు చేశారు. సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నందుకు నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి కథ ఇటీవల కాలంలో రాలేదని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. అలాగే ఆర్ఎక్స్100 - కంచరపాలెం సినిమాలు హిట్టయినట్లే తమ  'శుభలేఖ+లు' సినిమా కూడా విజయం సాదిస్తుందని తెలిపారు.