మాస్ మహారాజ రవితేజకు ఇటీవల సరైన హిట్ లేదు. టచ్ చేసు చూడు, నేలటికెట్టు రెండు చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్ టైన్మెంట్ అని అభిమానులు భావించేవారు. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ అని నిర్మాతలు భావించేవారు. 

వరుస పరాజయాలతో పరిస్థితి మారిపోయింది. ఇదిలా ఉండగా రవితేజ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. డిస్కోరాజా తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని ఇటీవల ధృవీకరించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను పర్వాలేదనిపించగా, బలుపు మంచి విజయం సాధించింది. 

దీనితో గోపీచంద్ మరోసారి రవితేజతో కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ పేరు వినిపిస్తోంది. శృతి హాసన్ బలుపు చిత్రంలో రవితేజతో కలసి రొమాన్స్ పండించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి త్వరలో మరిన్ని వివారాలు తెలియనున్నాయి.