కమల్ హాసన్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆరంభంలో కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నారు. గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఆమె జైత్ర యాత్ర ప్రారంభమైంది. గబ్బర్ సింగ్, బలుపు, శ్రీమంతుడు, రేసు గుర్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో శృతి హాసన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

లండన్ కు చెందిన మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో చాలా కాలం పాటు శృతి హాసన్ ప్రేమాయణం సాగించింది. అతడిని తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. దీనితో మైఖేల్, శృతి పెళ్లి పీటలెక్కడం ఖాయం అని అనుకున్నారు. అంతలోనే బ్రేకప్ జరిగిపోయింది. ఈ ఏడాది వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ప్రేమ విఫలం కావడంపై శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మైఖేల్ తో బ్రేకప్ జరిగిందని తెలియగానే తన సన్నిహితులంతా శృతి హాసన్ ఏంటి ఎలా చేస్తోంది అని అనుకున్నారు. కానీ మైఖేల్ నుంచి విడిపోవడం నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చేలా పెద్ద వ్యవహారమే జరిగినట్లు శృతి మాటలని బట్టి తెలుస్తోంది. 

జీవితం పెర్ఫ్యూమ్ లాంటిది అంటూ వేదాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఒకేసారి పలు రకాల పెర్ఫ్యూమ్స్ వాసనలు చూస్తే ఏది ఏ వాసనొ అర్థం కాదు. తన ప్రేమ వ్యవహారం కూడా అలాగే జరిగిందని శృతి హాసన్ తెలిపింది. ప్రస్తుతం శృతి హాసన్ తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది.