శృతి హాసన్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా రాణిస్తుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ భామ తన ప్రియుడు శాంతను గురించి ఓపెన్ అయ్యింది. ఓ సీక్రెట్ బయటపెట్టింది.
శృతి హాసన్ ఇటీవల వరుస విజయాలను అందుకుంది. నటిగా కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న అనంతరం తెలుగు సినిమాలకే సైన్ చేసింది శృతి. ఇక్కడ పవన్‌తో `వకీల్ సాబ్`, రవితేజతో `క్రాక్` సినిమాలు చేసింది. ఈ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె నటించిన `వీరసింహారెడ్డి`, `వాల్తేర్ వీరయ్య` హిట్లు కొట్టాయి. దీంతో గోల్డెన్ లెగ్‌గా మారింది శృతి. ఓ వైపు ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది.
మరోవైపు తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తుందీ కమల్ హాసన్ తనయ. గత రెండేళ్లుగా శృతి..శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ ని లవ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు చాలా కాలంగా సహజీవనం చేస్తుంది. ముంబయిలో ఓఫ్లాట్ తీసుకుని కలిసే ఉంటున్నారు. సినిమా షూటింగ్ లేని సమయంలో ప్రియుడితోనే గడుపుతుంది శృతి.
తాజాగా ప్రియుడు శాంతను గురించి ఓ సీక్రెట్ బయటపెట్టింది శృతి హాసన్. ఆయన్ని హగ్ చేసుకున్న ఉన్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇందులో ప్రియుడిగా గురించి చెప్పుకొచ్చింది. తనలాగే శాంతను కూడా ఫుడ్ లవర్ అట. ఇద్దరు కలిసి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తామని చెప్పింది. ఇద్దరం తినడం కోసమే బతుకుతున్నామంటూ ప్రియుడిని కసిగా కొరుకుతున్న ఫోటోని పంచుకుంది శృతి. ఇది వైరల్ అవుతుంది.
ఇందులో శృతి చెబుతూ, తనకు బయట ఫుడ్ తినడం ఇష్టమట. తాను, శాంతను తినడం కోసమే బతుకుతున్నాం. తినేటైమ్‌లో ఎన్నో విషయాలను మాట్లాడుకుంటామని, తన లాగే శాంతను కూడా భోజన ప్రియుడని, అతన్ని లవర్‌గా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది శృతి. అంతేకాదు శాంతను తన లైఫ్‌లోకి వచ్చినందుకు తాను ఎంతో లక్కీ అంటూ పేర్కొంది శృతి హాసన్. ప్రియుడిపై బోలెడంతా ప్రేమని గురిపించింది. ప్రస్తుతం శృతి పోస్ట్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అది చూసే ప్రేమించావా? అంటూ సెటైర్లేస్తున్నారు.
ప్రస్తుతంఈ సొట్టబుగ్గల సుందరి ప్రభాస్‌తో కలిసి `సలార్` చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కొత్తగా ఇప్పటి వరకు మరే సినిమాకి సైన్ చేయలేదు శృతి. అధికారికంగా ఏ సినిమాని ప్రకటించలేదు. కానీ `ది ఐ` అనే ఓ ఇంగ్లీష్ సినిమాలో నటిస్తుంది. సౌత్‌లో మాత్రం ఆమెకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడం గమనార్హం.
