రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 6 రోజుల్లో 450 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చింది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 6 రోజుల్లో 450 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు కోరుకునే హిట్ గా సలార్ నిలిచింది. 

ఎలేవేషన్ మాస్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా మెరిసింది. శృతి హాసన్ కూడా కథలో కీలకమైన పాత్రలో నటించింది. 

శృతి హాసన్ ఆచితూచి అడుగులు వేస్తూ దూసుకుపోతోంది. సలార్ షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంత సరదాగా గడిపానో గుర్తు చేస్తూ శృతి హాసన్ తాజాగా ఓ పోస్ట్ చేసింది. షూటింగ్ గ్యాప్ లో సెట్స్ లో క్రికెట్ ఆడుతున్న దృశ్యాలని శృతి హాసన్ పోస్ట్ చేసింది. 

View post on Instagram

శృతి హాసన్ సలార్ సెట్స్ లో క్రికెట్ ఆడుతూ సిక్సర్లు కొడుతోంది. ఆమె వెనుకాల ఉంటూ ప్రశాంత్ నీల్ వికెట్ కీపింగ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా బ్యాటింగ్ చేశారు. అదే విధంగా శృతి హాసన్ సెట్స్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో ఉన్న దృశ్యాలని కూడా పోస్ట్ చేసింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 2 శౌర్యాంగ పర్వంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.