ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ శ్రుతి హాసన్. రెండు కాళ్ళకు దెబ్బలు తగిలాయంటూ ఫోటోను శేర్ చేసింది. ఫ్యాన్స్ బాధపడేలోప పెద్ద ట్విస్ట్ ఇచ్చింది బ్యూటీ.. అసలేం జరిగింది.
కెరీర్ కు కొంత కాలం గ్యాప్ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రుతి హాసన్. ఏజ్ బార్ అయిన హరోయిన్లకు పెద్దగా ఛాన్స్ లు రావు.. ఏ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో చేసుకుని బ్రతకాలి. తన తరువాత వచ్చిన హరోయిన్లు చాలా మంది ఛాన్స్ లు లేక ఖాళీగా ఉంటుంటే.. శ్రుతి హాసన్ మాత్రం ఇప్పటికీ మంచి ఫామ్ ను కొనసాగిస్తోంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతోంది.
ఇక ఇక ఒక సారి లవ్ లో ఫెయిల్ అయిన శ్రుతి హాసన్.. ప్రస్తుతం మరోసారి ప్రేమలో మునిగి తేలుతోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ హజారికాతో ఎక్కువగా ఫోటోలు పెడుతోంది. అంతే కాదు ఫిట్ నెస్ పై ఎక్కువగా కాన్సంట్రేట్ చేసిన శ్రుతి హాసన్.. వరుసగా వర్కౌట్ వీడియోస్ ను పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అంతే కాదు తన బాయ్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేసిన వీడియోలు, ఫోటోలను ఎక్కువగా పంచుకుంటుంది బ్యూటీ. ఈక్రమంలోనే ఆమో రీసెంట్ గా శేర్ చేసిన ఓ పోస్ట్ ఫ్యాన్స్ ను కంగారు పెట్టింది.
ఓవైపు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటోంది శ్రుతి హాసన్. అదీగాక ఎప్పుడూ ఫిట్నెస్ కి ప్రాధాన్యతనిచ్చే ఈ భామ.. కాగా.. ఖాళీ సమయం దొరికితే వర్కౌట్స్ పై దృష్టిపెట్టే శృతి.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ ను కంగారు పెట్టాయి. శృతి పోస్ట్ చేసిన ఫోటోలలో.. వర్కౌట్స్ చేసి చేసి.. ఆమె మోకాళ్ళు బాగా కందిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. తెల్ల చర్మంపై కందిపోయిన మరకలు చూసి.. శృతికి గాయాలయ్యాయని ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. అయితే ఫ్యాన్స్ కంగారు పడే అవసరం లేకుండా ‘గుడ్ డే ఎట్ వర్క్’ అని మెన్షన్ చేసింది బ్యూటీ. దీంతో అసలు విషయం తెలిసి కూల్ అయ్యారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వర్కౌట్స్ ఈ స్థాయిలో అవసరమా.. ఆల్రెడీ చిక్కిపోయి కనిపిస్తున్నావు అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు సీనియర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారింది శ్రుతి హాసన్. రవితేజ క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన శ్రుతి ఈసినిమాతో సూపర్ హిట్ అందుకుంది.ఇక ప్రస్తుతం ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు ప్రభాస్ జోడీగా నటిస్తున్న ఈ బ్యూటీ.. వెరీ రీసెంట్ గా సలార్ షూట్ పూర్తి చేసుకుంది.తన వరకు షూటింగ్ పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక ఈసినిమాలే కాకుండా ది ఐ అని ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా చేస్తోంది భామ.
