కెరీర్ మాంచి ఫామ్ లో ఉన్నప్పుడు  ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి షాక్ ఇచ్చింది శృతిహాసన్. తన లవర్ మైఖేల్ తో వివాహం కోసమే శ్రుతి ఈ డెసిషన్ తీసుకుందని అందరు భవించారు. అయితే రీసెంట్ గా  హఠాత్తుగా వీరిద్దరూ విడిపోయారు.  రీసెంట్ గా  లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేఫధ్యంలో సినిమాలు మళ్లీ కమిటవ్వటం మొదలెట్టింది. అందులో భాగంగా ఆమె ఓ హాలీవుడ్ ప్రాజెక్టు కమిటయ్యింది. 

యు ఎస్ ఏ నెట్వర్క్స్ నిర్మించనున్న ‘ట్రెండ్ స్టోన్’ సిరీస్ లో ఓ కీలక పాత్రకోసం నిర్మాతలు శృతి హాసన్ ను సంప్రదించారని సమాచారం.  జేసన్ బౌర్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శృతి హాసన్ కనిపించనుంది.  ఇందులో ఆమె వెయిట్రెస్‌గా కనిపిస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారట. 

ఇక ఈ ఎపిసోడ్‌కు రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా, భారత్‌లో ఈ ఎపిసోడ్‌  షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. కెరీర్ పరంగా ఈ ప్రాజెక్టు శ్రుతికి మంచి ఆఫర్.  ఓ హీరోయిన్ గా శ్రుతి హాసన్ కెరీర్ లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఈ సీరీస్  విజయం అయితే క‌నుక‌, ప్రియాంక చోప్రాకు వ‌చ్చినంత పేరు శ్రుతిహాస‌న్‌కు కూడా వ‌స్తుంది. దీంతో ఆమెకు ఇంటర్నేషనల్ గా గుర్తింపు లభిస్తే.. హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వచ్చే ఛాన్స్‌ ఉంది.