స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కాటమరాయుడు చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు. తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలని అంగీకరిస్తోంది. శృతి హాసన్ కెరీర్ గతంలో లాగా ప్రస్తుతం జోరుగా సాగడం లేదు. ఈ తరుణంలో మళ్ళీ పుంజుకునేందుకు శృతి హాసన్ కు అవకాశాలు వస్తున్నాయి. శృతి హాసన్, రవి తేజ బలుపు చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

'బలుపు' దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శత్వంలోనే రవితేజ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి శృతి హాసన్ ని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారట. కానీ శృతి హాసన్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలో నటించాలంటే తనకు రూ 1.5 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

దీనితో చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. శృతి హాసన్ రెమ్యునరేషన్ తగ్గించుకుని ఈ చిత్రాన్ని అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం శృతి హాసన్ తమిళంలో ఓ చిత్రంలో, బాలీవుడ్ లో మరో చిత్రంలో నటిస్తోంది. తెలుగులో శృతి హాసన్ గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.