బాలయ్యకు నో చెప్పిన శృతిహాసన్, కానీ రిక్వెస్ట్ చేయటంతో...
ఈ చిత్రం కోసం శృతిహాసన్ ని గోపిచంద్ మలినేని అడగటం నిజమే అని తెలుస్తోంది. అయితే శృతిహాసన్ మాత్రం నో చెప్పిందిట. కానీ సినిమాలో కనిపించనుందని సమాచారం. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిగాయని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. కాగా ఇప్పుడు మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాషూటింగ్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుందని వార్తలు వచ్చాయి.సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు గోపిచంద్. ఈ సినిమాలలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా మెప్పించింది. దాంతో అదే డైరక్టర్ కాంబినేషన్ అనగానే శృతిహాసన్ చేయబోతోందన్నారు. నిజా నిజాలేమిటో చూద్దాం.
ఈ చిత్రం కోసం శృతిహాసన్ ని గోపిచంద్ మలినేని అడగటం నిజమే అని తెలుస్తోంది. అయితే శృతిహాసన్ మాత్రం నో చెప్పిందిట. అందుకు కారణం ఇప్పుడు తాను సలార్ లోబిజీగా ఉన్నానని అన్నారట. అయితే నిజానికి సీనియర్ హీరోల ప్రక్కన చేయటం శృతి హాసన్ కు ఇష్టం లేకే నో చెప్పిందని తెలుస్తోంది. అయితే గోపిచంద్ మలినేని కోరిక మేరకు ఆ సినిమాలో లీడ్ పెయిర్ గా కాకుండా మరో కీలకమైన పాత్రలో కనిపించనుందిట. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదుంది శృతిహాసన్. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న శృతిహాసన్ ఇపుడు బాలయ్య సినిమాలో మెరువబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాలకృష్ణ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట గోపిచంద్. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారమ్.. వచ్చే ఏడాది వేసవికు విడుదల కాబోతోందని సమాచారం. అఖండ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ సినిమా షూటింగులో జాయిన్ అవుతారట బాలకృష్ణ.