విశాల్ కు పొలిటికల్ గా స్కెచ్ వేస్తున్న శృతీహాసన్

shruthi hassan political sketch for vishal
Highlights

  • పూర్తిగా రాజకీయాల్లో కమల్ హాసన్
  • కమల్ కు సలహాలిస్తున్నానంటూ శృతి హడావుడి
  • కమల్ కు సలహాదారుగా వున్నానంటున్న శృతి

కమల్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయన కుమార్తె శృతి హాసన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన తండ్రి ప్రజా సేవ వైపు నడవడం, మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటానని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతానని ప్రకటించడంతో శృతి హాసన్‌కు తండ్రిపై అపారమైన గౌరవం పెరిగింది. దీంతో కమల్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిందట శృతి హాసన్. అంతటితో ఆగలేదు రాజకీయంగానే కాదు. మీరు వేసే ప్రతి అడుగులో సలహాలను నేను ఇస్తూ, మీ వెంట నేనుంటా నాన్నా అంటూ మాట ఇచ్చిందట. 
 


తన కుమార్తె సంతోషాన్ని చూసిన కమల్ హాసన్ నీ సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకుంటానమ్మా. తర్వాత కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశారట. ఇప్పుడు శృతి తన స్నేహితులను కలిసి నా తండ్రికి నేనే సలహాలు ఇస్తున్నానంటూ తెగ ఆనందపడుతూ చెప్పేస్తోందట. రాజకీయాలకు ఇద్దరూ కొత్తే అయినా వీరు ఎలాంటి సలహాలు, సూచనలు చెప్పుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. 


 

అయితే శృతిహాసన్ మాత్రం తనకు తెలిసిన సినీప్రముఖులను కమల్ హాసన్ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేస్తోందట. అందులో మొదటి వ్యక్తి విశాల్. ఇప్పటికే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తమిళ సినీపరిశ్రమలో ప్రచారం జరిగింది. ఇలా తమిళ సినీపరిశ్రమలో పేరున్న యువ హీరోలను కమల్ చెంత చేర్చేందుకు శృతి స్కెచ్ వేస్తోందట.

loader