హీరోయిన్ గా సింగర్ గా అలాగే బెస్ట్ డ్యాన్సర్ గా వివిధ వేరియేషన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతి హాసన్. అప్పుడపుడు సమాజం గురించి స్త్రీలకు సంబందించిన విషయాల గురించి కూడా శృతి స్పందిస్తుంటారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మగాళ్లపై ద్వేషం, ఆడవాళ్ల సమస్యల గురించి ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేసింది. 

ముఖ్యంగా ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యలకు ప్రధానం కారణం వారిలో ఐక్యమత్యం లేకపోవడమే అని వివరణ ఇచ్చారు. అందుకే తన టీమ్ లో ఎక్కువగా ఐక్యతతో ఉండేలా ప్లాన్ చేసుకుంటామని చెబుతూ మగాళ్ళను ద్వేషించే క్యాటగిరిలో నేను లేనని శృతి వివరించారు. 'ఎందుకంటే నా తండ్రి ఎంతో ప్రేమతో  దైర్యంగా పెంచాడు ఆయన స్ట్రాంగ్ మ్యాన్.. అందుకే నేను స్ట్రాంగ్ వుమెన్' అయినట్లు తెలిపింది. 

ఇక లండన్ లో ఉన్న తన మ్యూజిక్ బ్యాండ్ లో అందరూ ఆడవాళ్లే అని చెబుతూ.. వారై టాలెంట్ ను గుర్తించి వారికి జాబ్ ఇచ్చానని అన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ఒక హిందీ సినిమాతో అలాగే మరో తమిళ్ సినిమాతో బిజీగా ఉంది. తెలుగు సినిమాలను బాగా తగ్గించిన అమ్మడు చివరగా 2017లో కాటమరాయుడు సినిమా తరువాత మరో సినిమాలో నటించలేదు.