శ్రీయా శరన్ అరుదైన ఓ ఫోటో తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. శ్రీయా స్కూల్ డేస్ సమయంలో ఇచ్చిన స్టేజ్ పెరఫార్మెన్సు సంబంధించిన ఫోటో పోస్ట్ చేశారు . స్కూల్ యాన్వల్ డే సందర్భంగా ఇచ్చిన డాన్స్ పెరఫార్మెన్సు కి సంబంధించిన ఆనాటి జ్ఞాపకాలు అభిమానులతో పంచుకుంది.
దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది శ్రీయా శరన్. అందరు టాప్ స్టార్స్ తో నటించిన శ్రీయా, స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆకట్టుకొనే అందం, నటనకు తోడు అమేజింగ్ డాన్సు స్కిల్స్ ఆమెను స్టార్ హీరోయిన్ గా తీర్చిదిద్దాయి. చిన్నప్పటి నుండి డాన్స్ నేర్చుకున్నశ్రీయా శరణ్...కథక్ డాన్స్ లో ప్రావీణ్యం సాధించారు.
మోడరన్, క్లాసిక్ ఏ డాన్స్ అయినా శ్రీయా తనదైన శైలిలో ఇరగదీసేవారు. కాగా తన స్కూల్ యానివర్సరీ సంధర్బంగా స్టేజ్ పై డాన్స్ పెరఫార్మెన్సు ఇచ్చిన శ్రియా చరణ్, అప్పటి ఫొటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.
క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చీర ధరించిన ఉన్న శ్రీయా చరణ్ గుర్తు పట్టడం కొంచెం కష్టమే అనాలి. టీనేజ్ లో ఉన్న శ్రియా చరణ్ కొంచెం విభిన్నంగా కనిపించారు. అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై శ్రియా డాన్స్ పెరఫార్మెన్సు ఇచ్చారు.
ఆర్ ఆర్ ఆర్ లో శ్రీయా శరన్ క్యామియో రోల్ చేస్తున్నారు. తక్కువ నిడివి గల పాత్రలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా ఆమె నటిస్తున్నారు. 2018లో శ్రియా రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషీవ్ ని వివాహం చేసుకున్నారు.
2001లో విడుదలైన ఇష్టం సినిమాలతో శ్రీయా వెండితెరకు పరిచయం అయ్యారు. 2002లో నాగార్జున హీరోగా దశరధ్ దర్శకత్వంలో వచ్చిన సంతోషం ఆమెకు ఫస్ట్ హిట్ ఇచ్చింది. నువ్వే నువ్వే, ఠాగూర్, ఛత్రపతి, వంటి బ్లాక్ బస్టర్స్ లో శ్రీయా హీరోయిన్ గా నటించింది. సౌత్ తో పాటు హిందీ చిత్రాలలో కూడా నటించి శ్రియా సత్తా చాటారు.
