శ్రియ కొత్త లుక్ చూశారా..?

shriya saran's new look in veerabhoga vasantharayulu
Highlights

డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రియ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో శ్రియ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ఇంద్రసేన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను బెల్లన అప్పారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి కొత్త పోస్టర్లను విడుదల చేస్తోన్న చిత్రబృందం తాజాగా శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రియ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో శ్రియ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆమె సినిమా చేయడానికి అంగీకరించిందట. ఆమె కెరీర్ లోనే చెప్పుకోదగ్గ పాత్రలో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. నారా రోహిత్ కూడా సినిమాలో సరికొత్త లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఒంటి చేతితో అతడి పాత్ర ఉంటుందని టాక్. శ్రీవిష్ణు గుండు, ఒంటి నిండా టాటూలతో కనిపిస్తాడట.

ఇంకా సుధీర్ బాబు లుక్ ఎలా ఉంటుందనే విషయం సస్పెన్స్ గానే ఉంది. టైటిల్, పోస్టర్లతో ఆడియన్స్ లో ఆసక్తి క్రియేట్ చేస్తోంది చిత్రబృందం. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే!

loader