బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోంది. బి.మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.

అదేమిటంటే...ఈ సినిమాలో శ్రియ నటించే అవకాసం ఉంది. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుగుతున్నాయి.  ‘అందాధున్’ ఒరిజినల్ మూవీలో సీనియర్  టబు నటించి మెప్పించింది. ఈ సినిమాకు ఆమె పాత్రే కీలకం. అయితే ఆమె పాత్రలో ఎవర్ని తీసుకుంటే బాగుంటుందనే విషయం గత నాలుగైదు నెలలుగా నలుగుతోంది. టబునే తీసుకుందామని అనుకున్నా..తర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో ఆ పాత్రలకు కొద్దిగా కూడా క్రేజ్ రాకపోవటం,కోటి రూపాయిలు అడటంతో ఆమె వద్దనుకున్నారట. ఆ తర్వాత  ఇలియానాను అడిగితే ..తాను ఇలాంటి పాత్ర చేయలేనని తేల్చి చెప్పేసిందట. ఇక చివరగా శ్రియ, ప్రియమణి, మమతామోహన్‌ దాస్ ఇలా ఇంకొందర్ని సంప్రదిస్తే...శ్రియ ఓకే చేసిందిట.

శ్రియ అయితే సినిమాకు పూర్తి న్యాయం చేస్తుందని నితిన్ కూడా భావిస్తున్నాడట. అంటే శ్రియ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తోందన్న మాట. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిలైంది. అడపా,దడపా ఇలా కీలక పాత్రల్లో నటిస్తోంది. 2021 మార్చి నుంచి షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.   మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు.  ఈ చిత్రం హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి!  ఆ పాత్రను నితిన్ వేయబోతున్నారు. రీసెంట్ గా భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ పాత్రను చేయటానికి ఉత్సాహం గా ఉన్నారు.  ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 

సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంత్
సమర్పణ: బి. మధు (ఠాగూర్ మధు)
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్