సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇప్పటికి కొరటాల కథ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. సైరా పూర్తి కాగానే అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల కోసం కొరటాల శివ పెద్ద కసరత్తే చేస్తున్నాడు. అనుష్క, శృతి హాసన్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా కొరటాల మాత్రం కన్విన్స్ కావడం లేదట. 

తాజాగా మెగాస్టార్, కొరటాల చిత్రానికి సంబంధించి మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల విడుదలైన నేచురల్ స్టార్ నాని చిత్రం జెర్సీ ఎమోషనల్ గా అదరగొట్టింది. మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ నాని భార్యగా అద్భుతంగా నటించింది. ఆమె సహజసిద్ధమైన నటనకు కొరటాల శివ ఫిదా అయ్యారట. 

చిరంజీవి చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఓ హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ ని తీసుకునే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే శ్రద్దా శ్రీనాథ్ కు బంపర్ ఆఫర్ దక్కినట్లే. శ్రద్దా శ్రీనాథ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది.