Asianet News TeluguAsianet News Telugu

కోట్లల్లో విలువచేసే కార్లు వదిలేసి ఆటో ఎక్కిన ప్రభాస్ హీరోయిన్.. వీడియో వైరల్

చిత్ర పరిశ్రమలో స్టార్ సెలెబ్రిటీల ఆదాయం కోట్లల్లో ఉంటుంది. చాలా మంది స్టార్స్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కొందరు సెలెబ్రిటీలు మాత్రం లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ సింపుల్ గానే ఉంటారు.

Shraddha kapoor enjoys auto ride in Mumbai
Author
Hyderabad, First Published Sep 26, 2021, 12:56 PM IST

చిత్ర పరిశ్రమలో స్టార్ సెలెబ్రిటీల ఆదాయం కోట్లల్లో ఉంటుంది. చాలా మంది స్టార్స్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కొందరు సెలెబ్రిటీలు మాత్రం లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ సింపుల్ గానే ఉంటారు. కొందరు సెలెబ్రిటీలు అప్పుడప్పుడప్పుడూ సామాన్య ప్రజలలాగా ఉండేందుకు ఇష్టపడతారు. 

సాహో చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రయాణించాలంటే ఏం చేస్తుంది. కోట్లల్లో విలువ చేసే కార్లు ఆమెను ఎలాగు ఉంటాయి. ఇక దూర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లాలంటే విమానాల్లో వెళుతుంది. కానీ శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్ ఆటోలో ప్రయాణిస్తుందని ఎవరైనా ఊహిస్తారా.. శ్రద్దా కపూర్ తాజాగా ఆటోలో ప్రయాణించి అందరిని సర్ ప్రైజ్ చేసింది. 

తాను ఆటోలో ప్రయాణించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది. దీనితో శ్రద్దా కపూర్ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అప్పుడప్పుడూ హీరోయిన్లు ఇలా సామాన్య ప్రజలలా ప్రవర్తించడం వారికి ఓ చిన్న సరదా. 

శ్రద్దా కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్దా కపూర్. ప్రభాస్ తో కలసి ఆమె సాహో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం శ్రద్దా కపూర్ చల్‌బాజ్‌ ఇన్‌ లండన్‌ చిత్రంలో నటిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios